ఉద్యోగ భద్రత కల్పించాలంటూ రాష్ట్రవ్యాప్తంగా ఏఎన్ఎమ్లు ఆందోళనకు దిగారు. అన్ని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయాల వద్ద ధర్నాలు చేపట్టారు. కృష్ణా జిల్లాలో మచిలీపట్నం డీఎమ్హెచ్ఓ కార్యాలయ ముట్టడికి వెళుతున్న ఏఎన్ఎమ్లను జి.కొండూరు వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మహిళా కానిస్టేబుళ్లు లేకుండానే అరెస్టు చేశారంటూ ఆరోగ్య కార్యకర్తలు ఆందోళన చేపట్టారు.
ఇదీ చదవండి