ETV Bharat / state

Corona update: రాష్ట్రంలో కొవిడ్ వ్యాప్తి క్రమంగా తగ్గుతోంది: సింఘాల్ - black fungus updates

రాష్ట్రంలో కొవిడ్ వ్యాప్తి తీవ్రత క్రమంగా తగ్గుతోందని వైద్యారోగ్యశాఖ స్పష్టం చేసింది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా రికవరీ రేటు కూడా గణనీయంగా పెరుగుతున్నట్టు ఆ శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ సింఘాల్(anil singhal) స్పష్టం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఆస్పత్రుల్లో పడకల ఖాళీలు పెరుగుతుండటంతో పాటు ఆక్సిజన్ వినియోగం కూడా తగ్గుతుండటం దీనికి నిదర్శనమన్నారు.

anil singhal
అనిల్ సింఘాల్
author img

By

Published : Jun 3, 2021, 9:34 PM IST

రాష్ట్రంలో క్రమంగా కరోనా తీవ్రత తగ్గుతోందని ప్రభుత్వం స్పష్టం చేసింది. రాష్ట్రవ్యాప్తంగా రికవరీ రేటు పెరుగుతోందని వైద్యారోగ్యశాఖ తెలియజేసింది. ప్రస్తుతం ఏపీలో కరోనా రోగుల రికవరీ రేటు 91 శాతంగా ఉందని.. త్వరలోనే ఇది 99 శాతానికి పెరుగుతుందని ఆ శాఖ ముఖ్యకార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా కొవిడ్ ఆస్పత్రులు, కొవిడ్ కేర్ కేంద్రాల్లో పడకల ఖాళీలు పెరుగుతున్నాయన్నారు. ఆక్సిజన్ వినియోగం కూడా గణనీయంగా తగ్గిందని.. ప్రస్తుతం 384 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ మాత్రమే వినియోగం అవుతోందన్నారు. 15 రోజులుగా రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య 24 వేల నుంచి 11 వేలకు తగ్గిందని అనిల్ సింఘాల్ తెలిపారు. తూర్పుగోదావరి, చిత్తూరు, అనంతపురం సహా ఇతర జిల్లాల్లోనూ కేసుల సంఖ్య తగ్గుతోందని ఆయన వివరించారు.

మరోవైపు కొవిడ్ చికిత్స కోసం ఆరోగ్యశ్రీ కూడా సక్రమంగానే అమలవుతోందని వైద్యారోగ్యశాఖ తెలియజేసింది. ప్రైవేటు ఆస్పత్రులు ఎక్కువగా ఛార్జీ చేస్తున్నారనే అంశంపై విజిలెన్సు అధికారులు తనిఖీ చేసి.. మొత్తం రూ.9.90 కోట్ల జరిమానా వసూలు చేసినట్టు వెల్లడించింది.

రాష్ట్రంలో 1,187 బ్లాక్ ఫంగస్ కేసులు నమోదు అయ్యాయని..ఆ రోగులకు కావాల్సిన మందులు, ఇంజక్షన్లు కేంద్ర ప్రభుత్వం సరఫరా చేస్తోందని అధికారులు స్పష్టం చేశారు. రాష్ట్రంలో కొవిడ్ కారణంగా 93 మంది చిన్నారులు అనాథలుగా మారారని వారికి రూ.10 లక్షల చొప్పున డిపాజిట్ చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తున్నట్టు వెల్లడించారు.

జూన్ నెలలో కేంద్ర ప్రభుత్వం నుంచి 36,94,210 డోసులు రానున్నట్టు ప్రభుత్వం తెలిపింది. రాష్ట్రప్రభుత్వం కూడా 20,74,730 డోసుల కోనుగోళ్లకు ఆర్డర్లు కూడా ఇచ్చినట్టు వెల్లడించింది.

ఇదీ చదవండి

CM Jagan Review: 'బ్లాక్‌ ఫంగస్‌ నివారణ ఇంజక్షన్లు, మందులు ఎక్కడున్నా సేకరించాలి'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.