రాష్ట్రంలో పాఠశాల స్థాయిలోనే 16.3శాతం మంది విద్యార్థులు చదువుకు స్వస్తి చెప్పేస్తున్నారు. దేశవ్యాప్తంగా మధ్యలోనే బడిమానేస్తున్న వారి జాబితాలో రాష్ట్రం 9స్థానంలో ఉంది. ఒడిషాలో అత్యధికంగా 27.3శాతం ఉండగా.. ఆ తర్వాత 21.7శాతంతో మేఘాలయ నిలిచింది. చదువు స్వస్తి చెబుతున్న వారిలో బాలికల కంటే బాలురే అధికంగా ఉంటున్నారని వెల్లడించింది. కేంద్ర విద్యాశాఖ యూడైస్ ఫ్లస్-2021-22 నివేదికను విడుదల చేసింది. పాఠశాలల్లో ఉపాధ్యాయుల సంఖ్య, ప్రవేశాలు, మౌలికసదుపాయాలు, బోధన విధానాలు, బడి మానేస్తున్న వారి వివరాలను వెల్లడించింది. రాష్ట్రంలో...61వేల9వందల48 ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు ఉండగా...82లక్షల44వేల6వందల47మంది విద్యార్థులున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో...3లక్షల20వేల7వందల24మంది ఉపాధ్యాయులు పని చేస్తున్నారు.
ఇవి చదవండి:
బాలికల కంటే బాలురే ఎక్కువగా చదువు ఆపేస్తున్నారు.. ఆ జాబితాలో ఏపీ స్థానం ఎక్కడ - తెలుగు తాజా
దేశవ్యాప్తంగా మధ్యలోనే చదువుకు స్వస్తి చెబుతున్న వారి జాబితాలో ఆంధ్రప్రదేశ్ 9వ స్థానంలో ఉందని.. కేంద్ర విద్యాశాఖ యూడైస్ ఫ్లస్-2021-22 నివేదికలో వెల్లడించింది. పాఠశాల స్థాయిలో చదువుకు స్వస్తి పలుకుతున్న విద్యార్థులు 16.3శాతం ఉండగా, అందులో బాలికల కంటే బాలురే అధికంగా ఉండటం గమనార్హం.