ఎవరూ పట్టించుకోని కరోనా మృతదేహాలకు గౌరవ ప్రదమైన పద్ధతిలో అంత్యక్రియలు నిర్వహించిన స్వచ్ఛంద సంస్థలు, వ్యక్తులను డీజీపీ గౌతం సవాంగ్ అభినందించారు. కష్ట కాలంలో ధైర్యంగా ముందుకొచ్చి సంప్రదాయ విధానంలో దహన సంస్కారాలు చేయడం గొప్ప విషయమని కొనియాడారు. ఆ సేవలకు గుర్తింపుగా పోలీస్ శాఖ తరఫున వారికి 'మానవత్వ ధీర' పురస్కారాన్ని అందజేస్తున్నామని వివరించారు. పోలీస్ ఉన్నతాధికారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతో వెబినార్ ద్వారా మాట్లాడిన డీజీపీ గౌతం సవాంగ్ ..ఇలాంటి సేవలను మరింత విస్తృతంగా చేపట్టాలని సూచించారు. గుంటూరు లోని అమ్మ ఛారిటబుల్ ట్రస్ట్ , విజయవాడ హెల్పింగ్ హ్యాండ్స్ సంస్థ ప్రతినిధులను పోలీస్ ప్రధాన కార్యాలయంలో సన్మానించారు.
ఇదీ చదవండి: