జై భీమ్ యాక్సెస్ జస్టిస్ వ్యవస్థాపక అధ్యక్షుడు, న్యాయవాది జడ శ్రావణ్ కుమార్ ఆధ్వర్యంలో అంబేడ్కర్ సిద్ధాంత అవగాహన తరగతి కార్యక్రమం విజయవాడలో నిర్వహించారు. తాము ప్రభుత్వానికి మాత్రమే వ్యతిరేకమని.. జగన్ మోహన్ రెడ్డికి కాదని ఆయన స్పష్టం చేశారు.
అంబేడ్కర్ విధానాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని.. ఆంధ్రప్రదేశ్లో యువతలో అంబేడ్కర్ భావాలను కలిగించాలనే ఈ కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. దీని ద్వారా రాజ్యాధికారం సాధించాలని రాష్ట్రంలో 20 నుండి 35 సంవత్సరాల వయస్సు మధ్య గల యువతను 2 లక్షల మందిని అంబేడ్కర్ వాదులుగా తయారు చేయాలనే లక్ష్యంతో తరగతులు నిర్వహిస్తున్నామని తెలిపారు. 2024లో యువత రాజ్యాధికారం సాధించాలని ఆయన పిలుపునిచ్చారు.
ఇదీ చదవండి: