కొవిడ్‌ను అరికట్టడంలో విఫలమైన ప్రభుత్వం కొవిడ్ మృతుల కుటుంబాలను, బాధితులను ఆదుకోవడంలో పూర్తిగా చేతులెత్తేసిందని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఆరోపించారు. విపక్ష పార్టీ నాయకులు ప్రభుత్వ వైఫల్యాలను నిరసిస్తూ వివిధ డిమాండ్లతో విజయవాడ కలెక్టరేట్ వద్ద నిరసన తెలిపి డీఆర్వోకు వినతిపత్రం ఇచ్చారు. ధాన్యం కొనుగోళ్లు జరిగి నెలలు గడుస్తున్నా.. ఇప్పటి వరకు సొమ్ము చెల్లించలేదని విమర్శించారు. ముఖ్యమంత్రి నివాసానికి సమీపంలోనే అత్యాచారాలు జరుగుతున్నా పట్టించుకునే పరిస్థితి లేదని ఆరోపించారు. ఇప్పటికైనా సీఎం జగన్ తాడేపల్లి రాజప్రసాదం నుంచి బయటకు వచ్చి అన్నివర్గాల సమస్యలను పట్టించుకోవాలని హితువు పలికారు. ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, తెదేపా అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభి, బోడె ప్రసాద్, తంగిరాల సౌమ్య.. పాటు జనసేన, సీపీఎం నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఇదీ చదవండీ.. DSC 2008: డీఎస్సీ 2008 అభ్యర్థులకు కాంట్రాక్టు విధానంలో ఉద్యోగాలు.. ప్రభుత్వం ఉత్తర్వులు