తెలంగాణలోని ఖమ్మం జిల్లా బోనకల్లు నుంచి రాష్ట్రంలోకి అక్రమంగా మద్యం తరలిస్తున్న వారిని కృష్ణా జిల్లా పోలీసులు పట్టుకున్నారు. నిందితులు జిల్లాలోని చందర్లపాడు గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు.
గ్యాస్ సిలిండర్లో పెట్టి..
నిందితులు మద్యం రవాణాకు కొత్త పద్ధతిని ఎంచుకున్నారు. గ్యాస్ సిలిండర్లో 100 మద్యం సీసాలు పెట్టి రాష్ట్రంలోకి తరలించేందుకు ప్రయత్నించారు. వత్సవాయి చెక్పోస్ట్ వద్ద పోలీసులకు అనుమానం వచ్చి సిలిండర్ను తనిఖీ చేయగా అందులో మద్యం సీసాలు ఉన్నట్లు గుర్తించారు. ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి మూడు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. వీరిపై కేసులు నమోదు చేసినట్లు వత్సవాయి ఎస్ఐ సోమేశ్వరరావు తెలిపారు.
ఇదీ చదవండి: