జీవో 35ని రద్దు చేయడం ద్వారా ఎయిడెడ్ జూనియర్ కళాశాలల్లో ఉన్న అధ్యాపకుల ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని ఎయిడెడ్ జూనియర్ కళాశాలల ఉద్యోగుల సంఘం డిమాండ్ చేసింది. విజయవాడలోని మాంటిస్సోరి జూనియర్ కళాశాలలో ఆ సంఘం సభ్యులు సాధారణ సర్వ సభ్య సమావేశం నిర్వహించారు. అన్ని వర్గాల వారికి ఆరోగ్య కార్డులు ఇస్తున్నట్లే ఎయిడెడ్ ఉద్యోగులకు ఇవ్వాలని.... సీపీఎస్ విధానాన్ని రద్దు చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. సీపీఎస్ నగదు ఏ ఖాతాకు వెళ్తుందో తెలియడం లేదన్నారు. అసలు పింఛను చెల్లించాలా వద్దా అనే సందిగ్ధంలో ఉద్యోగులు ఉన్నారన్నారు. ప్రభుత్వం వెంటనే తమ సమస్యలు పరిష్కరించాలని కోరారు.
ఇదీ చూడండి: