ETV Bharat / state

నూజివీడులో ఏఐటీయూసీ ఆధ్వర్యంలో రైతుల ఆందోళన

సన్న, చిన్నకారు రైతాంగానికి ప్రభుత్వం పట్టాలు పంపిణీ చేయాలంటూ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో రైతులు ఆందోళన చేశారు.

author img

By

Published : Nov 25, 2019, 8:25 PM IST

నూజివీడులో ఏఐటీయూసీ ఆధ్వర్యంలో రైతుల ఆందోళన
నూజివీడులో ఏఐటీయూసీ ఆధ్వర్యంలో రైతుల ఆందోళన

కృష్ణా జిల్లా నూజివీడులో ఏఐటీయూసీ ఆధ్వర్యంలో రైతులు ఆందోళన బాట పట్టారు. దశాబ్దాలుగా భూములను నమ్ముకొని వ్యవసాయం చేస్తున్న రైతులకు... ప్రభుత్వం పట్టాలు పంపిణీ చేయాలని డిమాండ్​ చేశారు. నగర రహదారి గుండా భారీ ర్యాలీ నిర్వహించి మండల తహసీల్దార్​ కార్యలయం దగ్గర రాస్తారోకో చేశారు. అనంతరం ఎమ్మార్వో సురేష్​ కుమార్​కు వినతి పత్రాన్ని అందజేశారు. మూడు తరాలుగా వ్యవసాయం కొనసాగిస్తున్న సన్న, చిన్నకారు రైతాంగానికి ప్రభుత్వం పట్టాలు పంపిణీ చేయాలని ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షులు చలసాని రామారావు డిమాండ్​ చేశారు. గడిచిన మూడు సోమవారాలు స్పందన కార్యక్రమాల ద్వారా పత్రాలు అందిస్తూ రైతులు గోడు వెళ్లబోసుకున్నా.. ఎవ్వరూ పట్టించుకోవడం లేదన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి రైతుల సమస్యను పరిష్కరించాలని కోరారు.

ఇదీ చదవండి:

'ఇసుగించొద్దు... పని కల్పించండి...'

Intro:ap_vja_22_25_bhumulaku_pattalu_avb_ap10122 కృష్ణాజిల్లా నూజివీడు దశాబ్దాలుగా భూములను నమ్ముకొని వ్యవసాయం చేస్తున్న రైతులకు ప్రభుత్వం పట్టాలు పంపిణీ చేయాలని డిమాండ్ చేస్తూ ఏ టి యు సి ఆధ్వర్యంలో రైతన్నలు ఆందోళన బాట పట్టారు కృష్ణా జిల్లా పరిధిలోని రెవిన్యూ డివిజన్ కేంద్రమైన నూజివీడు పట్టణంలో నేడు ఈ మేరకు ప్రధాన రహదారి గుండా భారీ ర్యాలీ నిర్వహించి మండల తాసిల్దార్ కార్యాలయం వద్ద ధర్నా రాస్తారోకో నిర్వహించారు అనంతరం మండల తాసిల్దార్ సురేష్ కుమార్ కు వినతి పత్రాన్ని అందజేశారు ఈ సందర్భంగా ఏఐటీయూసీ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు చలసాని రామారావు మాట్లాడుతూ గడచిన మూడు తరాలుగా అటవీ భూములు నమ్ముకొని సన్న చిన్న కారు రైతులు పంటలు పండిస్తూ జీవనం సాగిస్తున్నారు అమరజీవి కామ్రేడ్ దాసరి నాగభూషణం ఆధ్వర్యంలో నిర్వహించిన అలుపెరుగని పోరాట ఫలితంగా 15 వేల ఎకరాలకు పట్టాలు పొందటం జరిగింది అన్నారు 1970 తర్వాత పాలకులు పేదలకు పట్టాలు పంపిణీ చేయడంలో నిర్లక్ష్యం వహించారని అన్నారు 1985 ప్రాంతంలో స్వర్గీయ ఎన్టీఆర్ హయాంలో చెట్టు పట్టాలను అందించారని అనంతరం వాటిని రద్దు చేసి శాశ్వత పట్టాలు అందించలేదని విమర్శించారు గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు అసైన్మెంట్ కమిటీలను రద్దు చేయడం ద్వారా ఒక ఎకరం కూడా పేదవాడికి పంపిణీ జరగలేదన్నారు అసైన్మెంట్ కమిటీ పునరుద్ధరించడం తో పాటుగా అడవులను భూములు నమ్ముకొని గడిచిన మూడు తరాలుగా వ్యవసాయం కొనసాగిస్తున్నా సన్నకారు రైతాంగానికి ప్రభుత్వం పట్టాలు పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు గడిచిన మూడు సోమవారాలు స్వందన కార్యక్రమాల ద్వారా పత్రాలు అందిస్తూ రైతులను గోడు వెళ్లబోసుకున్న అని చెప్పారు ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి పట్టాలు పంపిణీ చేయకుండా ఆందోళన రాష్ట్రవ్యాప్తంగా చేసి అన్ని ప్రభుత్వ కార్యాలయాల ముట్టడి చేస్తామని ఆయన హెచ్చరించారు ఈ కార్యక్రమంలో రెవెన్యూ డివిజన్ పరిధిలోని సన్న చిన్న కారు రైతులు వేలాదిగా పాల్గొన్నారు బైట్స్ ) చలసాని రామారావు ఏఐటీయూసీ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు ( సర్ కృష్ణాజిల్లా నూజివీడు కిట్ 810 ఫోన్ నెంబర్ 8008020314)

Body:దశాబ్దాలుగా భూములు వ్యవసాయం చేస్తున్న రైతన్నలకు ప్రభుత్వం పట్టాలు పంపిణీ చేయాలని డిమాండ్ చేస్తూ రైతుల ఆందోళన

Conclusion:దశాబ్దాలుగా భూములను నమ్ముకొని వ్యవసాయం చేస్తున్న రైతన్నలకు ప్రభుత్వం పట్టాలు పంపిణీ చేయాలని డిమాండ్ చేస్తూ ఏఐటియుసి ఆధ్వర్యంలో రైతులు ఆందోళన బాట పట్టారు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.