రైతుల ఆదాయం, భూసారం పెంచడంతో పాటు వినియోగదారుల ఆరోగ్యం ప్రధాన అంశాలుగా సేంద్రీయ వ్యవసాయ నూతన విధానం రూపొందించాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు.. అధికారులను ఆదేశించారు. ఉన్నతాధికారులతో సచివాలయంలో సమావేశం నిర్వహించిన మంత్రి... నూతన విధాన రూపకల్పనకు సంబంధిత శాస్తవ్రేత్తలు, అధికారులతో చర్చించారు.
ఆంధ్రప్రదేశ్ సామాజిక సేంద్రీయ వ్యవసాయ విభాగం ఆధ్వర్యంలో తయారు కానున్న ఈ నూతన విధానంలో.. వ్యవసాయ శాఖలోని అన్ని విభాగాలు భాగస్వామ్యం కావాలని మంత్రి సూచించారు. సేంద్రీయ వ్యవసాయంపై రైతులకు విస్తృతంగా అవగాహన కల్పిస్తూనే రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించేలా చైతన్య కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. ఇందుకోసం అందుబాటులో ఉన్న సిబ్బందిని సమర్థంగా వినియోగించాలని ఆదేశించారు.
ఇదీ చదవండి: