పరిపాలన రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ.. రైతులు, మహిళలు చేపట్టిన ఆందోళనలు 378వ రోజు కొనసాగాయి. తుళ్లూరు, మందడం, వెలగపూడి, కృష్ణాయపాలెం, వెంకటపాలెం, అబ్బరాజుపాలెం, అనంతవరం, బోరుపాలెం, పెదపరిమి గ్రామాల్లో రైతులు నిరసన దీక్షలు కొనసాగించారు. అనంతవరం, ఉద్ధండరాయునిపాలెంలో రైతులు, మహిళలు ర్యాలీ చేశారు. మందడం, వెంకటపాలెంలోని శిబిరాలలో రైతులు అమరావతికి మద్దతుగా నినాదాలు చేశారు.
కృష్ణాయపాలెంలో మన్నవ దీప్తి అనే బాలిక తన 8వ పుట్టినరోజు వేడుకను నిరసన దీక్షశిబిరంలో చిన్నారుల మధ్య జరుపుకొంది. అమరావతే ఆంధ్రుల రాజధానిగా కొనసాగాలని కోరుకుంటున్న అందరి సమక్షంలో తన జన్మదిన వేడుకలు నిర్వహించుకుంది.
ఇదీచదవండి:
ఎస్‌ఈసీ ఆదేశాలు నిలిపివేయాలని పిటిషన్.. డిస్పోజ్ చేసిన హైకోర్టు