కృష్ణా జిల్లా కంచికచర్ల శివారులో.. ప్రమాదం జరిగింది. సీఎం భద్రతా విభాగంలో ఆర్ఎస్ఐగా పని చేస్తున్న నరసింహారావు ద్విచక్రవాహనంపై ప్రయాణిస్తుండగా.. అదుపు తప్పారు. వాహనం పొలాల్లోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో నరసింహారావు ఎడమ కాలు విరిగింది. వాహనంపై ఉన్న యువతికి గాయాలయ్యాయి.
స్థానికులు గమనించి.. పోలీసులకు సమాచారం ఇచ్చారు. గాయపడిన ఇద్దరినీ.. నందిగామ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఆర్ఎస్ఐ నరసింహారావు విధులు నిర్వహించి స్వగ్రామమైన మధిరకు వెళ్తుండగా ఈ ఘటన జరిగిందని పోలీసులు తెలిపారు.
ఇదీ చదవండి: