కృష్ణా జిల్లా నూజివీడులోని సాంఘిక సంక్షేమ సమీకృత బాలుర వసతి గృహంలో ఏసీబీ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. హాస్టల్లో పరిశుభ్రత లోపించిందని అవినీతి నిరోధక శాఖ అడిషనల్ ఎస్పీ సాయి కృష్ణ అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం విద్యార్థులకు ఆహారం అందడం లేదన్నారు. జూనియర్లను సీనియర్ విద్యార్థులు భయపెడుతున్నా... హాస్టల్ వార్డెన్లు పట్టించుకోవడంలేదని ఆక్షేపించారు. ఇంటిగ్రేటెడ్ హాస్టల్లో ముగ్గురు వార్డెన్లకు కేవలం ఒక్కరే ఉన్నారన్నారు. హాస్టల్లో చోటుచేసుకున్న సమస్యలపై... ప్రభుత్వానికి నివేదిక సమర్పించనున్నట్టు ఏసీబీ ఎస్పీ తెలిపారు.
ఇదీ చూడండి: