ETV Bharat / state

అబ్దుల్ కలాం వర్ధంతి సందర్భంగా చిత్రపటానికి నేతల నివాళి - కృష్ణాజిల్లా వార్తలు

కృష్ణాజిల్లా అవనిగడ్డలో అబ్దుల్ కలాం వర్ధంతి ఘనంగా జరిగింది. ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు, దివి మార్కెట్ కమిటీ ఛైర్మన్ కడవకొల్లు నరసింహారావు అబ్దుల్ కలాం చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. దేశానికి ఆయన చేసిన సేవలు మరవలేనివని కొనియాడారు.

అవనిగడ్డలో అబ్దుల్ కలాం వర్ధంతి.. నివాళులర్పించిన ఎమ్మెల్యే

author img

By

Published : Jul 27, 2020, 5:15 PM IST

Updated : Jul 27, 2020, 6:02 PM IST

కృష్ణాజిల్లా అవనిగడ్డ వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో అబ్దుల్ కలాం వర్ధంతి ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు, దివి మార్కెట్ కమిటీ ఛైర్మన్ కడవకొల్లు నరసింహారావు అబ్దుల్ కలాం చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

శాస్త్రవేత్తగా, రెండుసార్లు రాష్ట్రపతిగా అబ్దుల్ కలాం దేశానికి ఎనలేని సేవలు అందించారని ఎమ్మెల్యే అన్నారు. గుండె శస్త్ర చికిత్సకు ప్రధాన అవసరమైన స్టంట్ ని అతి తక్కువ ధరకు తీసుకురావడంలో అబ్దుల్ కలాం కృషి ఎనలేనిదన్నారు. ఆయన వల్ల ఎందరో పేదలకు గుండె శస్త్ర చికిత్సలు తక్కువ ధరకే అందుబాటులోకి వచ్చాయన్నారు. కరోనా కష్ట కాలంలో ఆయన ఉంటే దేశానికి మరెన్నో సేవలు అందించే వారని పేర్కొన్నారు. అబ్దుల్ కలామ్ సేవలు ప్రతి ఒక్కరికి ఆదర్శనీయమన్నారు.

ఇదీ చదవండి..

వృద్ధాశ్రమాల్లో చేర్పించేందుకు అయినవాళ్ల ఆరా!

Last Updated : Jul 27, 2020, 6:02 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.