సరదా కోసం సముద్ర తీరానికి వస్తే విషాదాన్ని మిగిల్చిన ఘటన.. కృష్ణా జిల్లా పాలకాయతిప్ప బీచ్లో జరిగింది. పశ్చిమగోదావరి జిల్లా దుగ్గిరాలకు చెందిన వంశీకృష్ణ.. కుటుంబసభ్యులతో కలిసి కార్తిక స్నానాలకు సముద్రానికి వచ్చారు. అందరూ స్నానాలు చేస్తుండగా అలల తాకిడికి వంశీకృష్ణ గల్లంతయ్యాడు. ఘటనాస్థలికి చేరుకున్న మెరైన్ పోలీసులు గాలింపు చేపట్టి మృతదేహాన్ని వెలికితీశారు. తమతో పాటే అప్పటివరకు సరదాగా గడిపి.. ఒక్కసారిగా విగతజీవిగా కనిపించటంతో కుటుంబసభ్యుల రోదనలు మిన్నంటాయి.
ఇదీ చదవండి: