విజయవాడ ప్రకాశం బ్యారేజ్ పై నుంచి దూకి ఓ యువకుడు ఆత్మహత్యకు యత్నించాడు. వెంటనే ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది అప్రమత్తమై అతనిని కాపాడారు. ప్రేమ విఫలం కావడంతోనే అతను ఆత్మహత్యకు యత్నించినట్లు పోలీసులు నిర్ధరించారు. బాధితుడు ఎస్ఆర్ కాలేజీ ప్రాంతానికి చెందిన తేజసాయిగా గుర్తించారు. అతను వ్యాన్ డ్రైవర్గా పని చేస్తున్నట్లు తెలిసింది. తీవ్రంగా గాయపడిన అతను ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.
ఇదీ చదవండీ...