ETV Bharat / state

'ఈ కార్మికుడి సేవకు అభినందనలు' - ముక్త్యాలలో కోతులకి ఆహారం పెట్టిన న్యూస్

ఆలయాల్లో తిరుగుతూ భక్తులు అందించే ఆహారంతో కడుపు నింపుకునే వానరాలకి లాక్​డౌన్​ కష్టం తెచ్చిపెట్టింది. ఈ నేపథ్యంలో ఓ కార్మికుడు ఆలయాల్లో ఉన్న వెయ్యి కోతులకి నిత్యం ఆహారం అందిస్తూ ఔదార్యం చాటుకున్నాడు. రోజుకి రూ.5వేల వరకూ ఖర్చు చేస్తూ ఈ సేవ చేస్తున్నాడు.

వానరాలకి ఆహారం అందిస్తున్న కార్మికుడు
వానరాలకి ఆహారం అందిస్తున్న కార్మికుడు
author img

By

Published : Apr 29, 2020, 10:51 PM IST

కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలైన వేదాద్రి, ముక్త్యాల ఆలయాల వద్ద సుమారు వెయ్యి కోతులు ఉంటున్నాయి. వాటికి నెలరోజులుగా ఓ కార్మికుడు ఆహారం అందిస్తున్నాడు. అగ్రహారం గ్రామానికి చెందిన బాలసైదా వెల్డింగ్ వర్క్​ నిర్వహించే షేక్ ఖాజా తన వద్ద పనిచేసే కార్మికులతో కలిసి ఔదార్యాన్ని చాటుకుంటున్నాడు. ఇప్పటికి రూ.1.50లక్షలు వరకూ వెచ్చించాడు. గతంలో ఆక్షేత్రాల్లో వెల్డింగ్ వర్క్ చేసిన ఖాజా... భక్తులు వేసే ఆహారంతో జీవించే కోతులని చూశాడు. లాక్​డౌన్​ కారణంగా క్షేత్రాలకు భక్తులను నిషేధం విషయం తెలుసుకుని వెంటనే స్పందించాడు.

లాక్​డౌన్​ ప్రకటించిన మూడో రోజునుంచి అనునిత్యం రూ.5వేల వరకూ ఖర్చు చేస్తూ ఈ సేవ చేస్తున్నారు. అరటిపండ్లు, గుగ్గిళ్లు, పుచ్చముక్కలతో పాటు స్వయంగా మొక్కజొన్న మైదా పూరీలు, ఇతర పిండి వంటలు తయారుచేసి వీటికి ఆహారం అందిస్తున్నారు. ఒక కారు రెండు బైకులపై ఐదుగురు కార్మికులతో కలిసి ఉదయనుంచి సాయంత్రం వరకూ శ్రమిస్తున్నారు.

కార్మికులకు నామమాత్రపు వేతనం ఇస్తూ ఈ పని కల్పించి సేవను కొనసాగిస్తున్నారు. వాహనాలు తిరిగేందుకు పోలీస్ అనుమతి లేకపోవటంతో ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను తన వాహనం ఇచ్చి సాయం చేశారు. తన వద్ద ఆర్థిక స్థోమత అయిపోయిందని... ఎవరైనా దాతలు ముందుకొస్తే కొనసాగిస్తానని ఖాజా చెబుతున్నారు. మండుటెండను లెక్క చేయకుండా ఆయన చేపట్టిన ఈ సేవకు నాయకులు, అధికారులు అభినందనలు తెలుపుతున్నారు.

ఇదీ చూడండి: మూగజీవులకు ఆహారం పెడుతున్న జంతు ప్రేమికుడు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.