ETV Bharat / state

వాలంటీర్లు పని చేయట్లేదంటూ విద్యుత్ స్తంభం ఎక్కి వ్యక్తి నిరసన - ఏపీలో లాక్‌డౌన్‌ వార్తలు

ప్రభుత్వ పనితీరును వ్యతిరేకిస్తూ ఓ వ్యక్తి విద్యుత్ స్తంభం ఎక్కి నిరసన వ్యక్తం చేశాడు. ఈ ఘటన కృష్ణా జిల్లా మొగల్రాజపురం కొండ ప్రాంతంలో జరిగింది.

a person protest on power pole at moglarajapuram
విద్యుత్ స్తంభం ఎక్కి వ్యక్తి నిరసన
author img

By

Published : May 11, 2020, 6:17 PM IST

ప్రభుత్వ సంక్షేమ పథకాలు తమకు అందడంలేదంటూ ఓ వ్యక్తి విద్యుత్ స్తంభం ఎక్కి నిరసన వ్యక్తం చేశాడు. కృష్ణా జిల్లా మొగల్రాజపురం కొండప్రాంతానికి చెందిన బాలవలస కోటేశ్వరావు అనే వ్యక్తి విద్యుత్ స్తంభం ఎక్కి హల్​చల్ చేశాడు. కరోనా సమయంలో ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు తమకు అందడంలేదంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. స్థానికంగా ఉండే వాలంటీర్లు సరిగా పని చేయట్లేదంటూ నిరసన తెలిపాడు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని అతడిని సముదాయించారు. కుటుంబ సభ్యులతో మైక్​లో మాట్లాడించి... తను కిందకు దిగేలా చేసి అతనిని మాచవరం పోలీస్ స్టేషన్​కు తరలించారు.. తాను దినసరి కూలీగా పనిచేస్తున్నానని .. గత నలభై రోజులుగా ఇంట్లోనే ఉండటంతో కుటుంబంలో పోషణ కష్టమవుతోందని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు.

దీచూడండి.

'లాక్​డౌన్​లో వాలంటీర్ల సేవలు వెలకట్టలేనివి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.