ETV Bharat / state

బైక్​ కనిపిస్తే చాలు ట్రయిల్​ అంటూ ఉడాయిస్తారు.. విజయవాడలో కొత్త రకం చోరీలు - krishna district crime news

‘అబ్బ.. మీ బండి ఎంత బాగుందో... ఎక్కడ తీసుకున్నారు.. ఈ మోడల్‌ చాలాబాగుంది.. ఒక్కసారి ట్రయల్‌ వేసి చూడనా.. ఇది నాబండి.. ఇక్కడే ఉంటుంది..! ఇప్పుడే వస్తాను..!’ అని అడిగితే.. మీరు కరిగిపోయారో.. మీబండి మాయం అయినట్లే..! అవును.. ఇప్పుడు విజయవాడలో నయా చోరీలు ఇలాగే జరుగుతున్నాయి. కొత్త ద్విచక్రవాహనాలపై కన్నేసిన మోసగాళ్లు మాయమాటలు చెప్పి బండ్లు దర్జాగా తీసుకెళ్తున్నారు.

విజయవాడలో ద్విచక్ర వాహనాల దొంగతనం
విజయవాడలో ద్విచక్ర వాహనాల దొంగతనం
author img

By

Published : Nov 20, 2020, 6:08 AM IST

విజయవాడలో కొత్త రకం దొంగతనాలకు పాల్పడుతున్నారు దొంగలు. కొత్త ద్విచక్రవాహనాలపై కన్నేసిన మోసగాళ్లు... మాయమాటలు చెప్పి బండ్లను దర్జాగా తీసుకెళ్తున్నారు. విజయవాడ సూర్యారావు పేట పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ యువకుడి కొత్త ద్విచక్ర వాహనాన్ని ఓ దొంగ మోసం చేసి తీసుకెళ్లాడు. దీనిపై బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయగా వారు కేసునమోదు చేశారు. ఇటీవల కాలంలో నగరంలోని పలు ప్రాంతాల్లో వరుస చోరీలు జరుగుతున్నాయి. కొత్త వాహనం కనిపిస్తే చాలు ట్రయల్ పేరుతో తీసుకెళ్లి ఊడయిస్తున్నారు. గురువారం ఒక్కరోజే మూడు ద్విచక్రవాహనాలు చోరికి గురయ్యాయి.

తాడేపల్లికి చెందిన సాయిసూర్య అనే యువకుడు కెటీఎం ఆర్‌సీ 200 అనే మోడల్‌బైక్‌తో డొమినోస్ ముందు ఆగాడు. అక్కడికి మరో వ్యక్తి కేటీఎం డ్యూక్‌ బైక్‌తో వచ్చాడు. సాయి సూర్య బైక్‌ బాగుందని పొగడ్తలతో ముంచెత్తాడు. ట్రయల్‌ చేసి ఇస్తానని నమ్మించి ద్విచక్రవాహనం తీసుకొని ఉడాయించాడు. ఎంతసేపటకి రాకపోవడంతో సూర్యారావుపేట పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

మొదట పోలీసులు కేసు నమోదు చేయలేదు. ఆ వ్యక్తికి అంటగట్టిన బైక్​ను పరిశీలిస్తే.. దొంగిలించినదేనని తేలింది. సాయిసూర్య దగ్గర అప్పగించిన కేటీఎం డ్యూక్‌ బైక్‌ విలువ రూ.1.40లక్షలు. దీన్ని కూడా అగంతకుడు దొంగిలించి తీసుకువచ్చాడు. ఆ వాహనం గుంటూరులోని మరో వ్యక్తిది. ఆ వ్యక్తికి ఓ బుల్లెట్‌ అప్పగించి ట్రయల్‌ వేస్తానని డ్యూక్‌బైక్‌ తీసుకున్నాడు. అతనికి అప్పగించిన బుల్లెట్‌ కూడా ఓ మెకానిక్‌ షాపు నుంచి అడిగి తీసుకుని ఇప్పుడే వస్తానని తీసుకున్నట్లు తేలింది. ఈ అగంతకుడు ఎక్కడా సీసీ కెమెరాలకు చిక్కలేదు.

ఇదీ చదవండి

'పంటను అమ్ముకోవడానికి దళారుల ప్రమేయం ఉండదు'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.