ETV Bharat / state

'కన్నబిడ్డలను పోషించుకోలేకపోతున్నాం.. కనికరించండి.' - లాక్ డౌన్ కారణంగా ఇబ్రహీంపట్నంలో ఓ తల్లి కష్టాలు

కరోనా మహమ్మారి తమను పస్తులుంచుతోందని.. తమ బిడ్డలను పోషించుకోవడం కూడా కష్టమవుతోందని.. దాతలు ఎవరైనా కనికరించి ఆదుకోవాలని ఓ తల్లి వేడుకుంటోంది. లాక్ డౌన్ వేళ ఉపాధి కోల్పోయి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తంచేస్తోంది.

a mother requeted to help at ibrahimpatnam vijayawada due to corona
లాక్ డౌన్ కారణంగా కుటుంబం కష్టాలు
author img

By

Published : May 16, 2020, 2:11 PM IST

కరోనా మహమ్మారి వేళ తన కుటుంబాన్ని ఆదుకోవాలంటూ కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం మండలం కొత్తూరులో ఓ మహిళ వేడుకుంటోంది. లాక్ డౌన్ కారణంగా తన భర్త తాపీ పని పోయిందని.. ఉపాధి కోల్పోయి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని తెలిపింది. తన ముగ్గురు కుమార్తెల్లో ఒక కుమార్తె దివ్యాంగురాలని... ఈ సమయంలో వారిని పోషించడం కష్టమవుతోందని కన్నీళ్ల పర్యంతమైంది. తనకు సరైన పోషణ అందించలేకపోతున్నామని.. మందులకు కూడా ఇబ్బందిగా ఉందని వాపోయింది. ఈ కష్ట తరుణంలో తమ కుటుంబాన్ని ఆదుకోవాలని విజ్ఞప్తి చేసింది.

ఇవీ చదవండి.. స్నేహం పేరుతో నమ్మించి వంచించి.. విషం తాగించి..!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.