మహబూబాబాద్ జిల్లా కురవి మండల కేంద్రంలో వానరాల సంచారం అధికంగా ఉంది. వానర సమూహం గ్రామంలో సంచరిస్తూ నానా హంగామా సృష్టిస్తుంటాయి. ఈ క్రమంలో గత రెండు రోజుల క్రతం ఓ వానరానికి పిల్లి కూన కనిపించింది. ఆ కోతి.. పిల్లి కూనను తన బిడ్డగా బావించి దానిని ఎత్తుకుని తిరుగుతోంది. తన చంక దింపకుండా తల్లిప్రేమను అందిస్తోంది.
వానరం కొంత సేపు పిల్లి కూనను వదిలిపెట్టడం... క్షణాల్లో దాన్ని తిరిగి చేతుల్లోకి తీసుకోవడం, గుండెకు హత్తుకుని బిడ్డలా చూసుకుంటున్న తీరును గ్రామస్థులు ఆసక్తిగా చూస్తున్నారు. ఇలాంటి వింత ప్రేమను తామెప్పుడూ చూడలేదని గ్రామస్థులు చెబుతున్నారు. జాతి వైరాన్ని విస్మరించి పిల్లి పిల్లపై వానరం చూపే తల్లిప్రేమ చూసేవారిని ఆలోచింపజేస్తుంది.
ఇదీ చదవండి: రాష్ట్రంలో 3 లక్షల రెమిడెసివిర్ ఇంజెక్షన్ల విక్రయం