కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గం పరిధిలోని పలు ప్రాంతాల్లో కోడి పందేల్లో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొంటున్నారు. కోడి పందేలు, పేకాట శిబిరాలు... నిర్వహిస్తున్నారు. ఈ ఘటనలో కోట్ల రూపాయలు చేతులు మారుతున్నా.. అధికారులు పట్టించుకోవటం లేదు.
- మోపిదేవి మండలం పెదప్రోలు శివారు కొక్కిలిగడ్డ రోడ్డులో.. పెద్ద ఎత్తున కోడి పందాలు, పేకాట శిబిరాలు నిర్వహిస్తున్నారు. రాత్రి సమయంలో ప్లడ్ లైట్స్ వెలుగులో జూదం ఆడుతున్నారు.
- నాగాయలంక మండలంలో పెదప్రోలు, నాగాయలంక మండలంలో సంగమేశ్వరం, గణపేశ్వరం, సోర్లగొంది, ఎటిమోగ, కోడూరు మండలం, రామకృష్ణాపురం, కోడూరు గ్రామాల్లో కోడిపందేలు నిర్వహిస్తున్నారు.
- కోడూరు మండలం, రామకృష్ణాపురం, కోడూరు గ్రామంలో కోడిపందేలు నిర్వహిస్తున్నారు.
- చల్లపల్లి మండలంలో పాగొలులో మరియు ఘంటసాల మండలం లో పాపవినాశనం, కొడాలి గ్రామాల్లో పేకాట, కోడి పందెపు శిబిరాలు పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నా పోలీసులు పట్టించుకోని పరిస్థితి నెలకొంది.
ఇదీ చదవండీ... కోడి పందాల బరిలో ఘర్షణ.. ముగ్గురికి తీవ్ర గాయాలు