![A government teacher died in a suspicious manner](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/6365837_deadfin.jpg)
కృష్ణా జిల్లా కంచికచర్లలో ఓ మహిళ మృతి స్థానికంగా కలకలం స్పష్టించింది. వీరులపాడు మండలం జుజ్జూరులోని జిల్లా పరిషత్ హైస్కూల్లో ఉపాధ్యాయురాలిగా పని చేస్తున్న నాగమణి అనుమానాస్పద రీతిలో మృతి చెందింది. మహిళ మృతదేహం దహనం కావటం, పక్కనే పెట్రోల్ బాటిల్ ఉండటం పలు అనుమానాలకు తావిస్తోంది. ఆమెకు వివాహమైనప్పటికీ కొన్నాళ్లుగా ఇంట్లో ఒక్కరే ఉంటున్నారు. మృతికి గల కారణాలేంటో తెలియరాలేదు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి: నిజాయతీ నచ్చిందన్నాడు..నట్టేట ముంచాడు