ETV Bharat / state

రాష్ట్రంలో విజృంభిస్తోన్న కరోనా వైరస్ - ఏపీలో కరోనా కొత్త కేసులు

రాష్ట్రంలో కరోనా మహమ్మారి మరింత విజృంభిస్తోంది. మొత్తం కేసులు 600 దాటగా.....వైరస్‌ మరో ముగ్గురిని బలితీసుకుంది. ముఖ్యమంత్రి నివాసానికి కూతవేటు దూరంలోనే ఓ మహిళ మృతి చెందడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. తాడేపల్లిలో...... పారిశుద్ధ్య పనులు విస్తృతం చేశారు. కృష్ణా జిల్లాలో కరోనా ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి.

రాష్ట్రంలో కరోనా విజృంభణ
రాష్ట్రంలో కరోనా విజృంభణ
author img

By

Published : Apr 19, 2020, 4:52 AM IST

Updated : Jun 4, 2020, 3:16 PM IST

రాష్ట్రంలో విజృంభిస్తోన్న కరోనా వైరస్

రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 603కు పెరిగింది. శనివారం 31 మందికి పాజిటివ్‌ వచ్చింది. కృష్ణా జిల్లాలో 17, కర్నూలులో 6, నెల్లూరులో 3, తూర్పుగోదావరి , ప్రకాశంలో రెండేసి కేసులు నమోదు కాగా....పశ్చిమగోదావరిలో మరో కేసు నమోదయ్యింది. శనివారం ఒక్కరోజే రాష్ట్రంలో ముగ్గురు మృతిచెందారు. కర్నూలు జిల్లాలో ఇద్దరిని మహమ్మారి బలితీసుకోగా గుంటూరు జిల్లా తాడేపల్లిలో సీఎం జగన్ నివాసానికి సమీపంలోని ఓ అపార్ట్‌మెంట్‌లో మహిళ చనిపోయింది. శ్వాసకోశ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న వృద్ధురాలిని... ఈనెల 14న విజయవాడలోని ఆస్పత్రికి తరలించగా 15న ఆమె కన్నుమూసింది. కరోనా నిర్థారణ పరీక్షల్లో ఆమెకు పాజిటివ్‌గా తేలింది. సీఎం నివాసానికి సమీపంలోనే వృద్ధురాలు నివసించే అపార్ట్‌మెంట్ ఉండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. హుటాహుటిన ఆ ప్రాంతమంతా పారిశుద్ధ్య చర్యలు చేపట్టారు. ఆమెకు ఎవరి ద్వారా వైరస్‌ సోకిందో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అపార్ట్‌మెంట్‌లో ఉండే వారందరనీ క్వారంటైన్ చేశారు. వృద్ధురాలి భర్త అపార్ట్‌మెంట్ కమిటీ అధ్యక్షుడు కావడంతో ఆయన ఎవరెవరిని కలిశారో గుర్తిస్తున్నారు. వారితో సన్నిహితంగా మెలిగిన ముగ్గురిని క్వారంటైన్‌ కేంద్రానికి తరలించినట్లు తెలుస్తోంది.

కృష్ణా జిల్లాలో శనివారం ఒక్కరోజే... 17 కొత్త కేసులు నమోదవడం కలవరపరుస్తోంది. జిల్లా వ్యాప్తంగా 70 కేసులుంటే వాటిల్లో 59 విజయవాడ నగరంలోనే ఉండడం ఆందోళన కలిగిస్తోంది. ఇక కర్నూలు జిల్లాలో శనివారం ఒక్కరోజే 11 కేసులు బయటపడంతో బాధితుల సంఖ్య 132కు పెరిగింది. ఓ వైద్యుడి ఇంట్లో ఆరుగురికి వ్యాధి సోకింది. కర్నూలు సర్వజన ఆస్పత్రిలో పనిచేసే మరో వైద్యురాలికి సైతం కరోనా పాజిటివ్‌ వచ్చింది. జిల్లాలో వైరస్ నివారణ చర్యలు వేగవంతం చేశారు. నంద్యాలలో డ్రోన్లతో రసాయనాలు పిచికారీ చేయగా ఆదోని శివారులో రణమండల కొండ ఆంజనేయస్వామి ఆలయానికి వచ్చిన వందకు పైగా భక్తుల వాహనాలను పోలీసులు సీజ్‌ చేశారు.

కడప జిల్లాలో ట్రూనాట్ యంత్రాల ద్వారా కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహిస్తున్నారు. జిల్లా కొవిడ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆరుగురికి నెగిటివ్‌ రిపోర్టు రావడంతో డిశ్చార్జి చేశారు. అనంతపురం జిల్లా అగలిలో పోలీసు సిబ్బంది యముడి వేషధారణలో నాటిక ప్రదర్శించి కరోనాపై అవగాహన కల్పించారు. ప్రకాశం జిల్లా డేగరమూడి వద్ద లారీ, మరో రెండు వాహనాల్లో వెళ్తున్న 108 మంది కూలీలను పోలీసులు అడ్డుకున్నారు. అందరికీ వైద్య పరీక్షలు నిర్వహించి తిప్పి వెనక్కి పంపించారు. తూర్పుగోదావరి జిల్లా మండపేటలో కరోనా పాజిటివ్ కేసు రావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. కడియంలో ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి సొంత డబ్బుతో సోడియం హైపోక్లోరైట్ ద్రావణాన్ని పిచికారీ చేయించారు. శ్రీకాకుళం జిల్లా లావేరులో ఎమ్మెల్యే స్టిక్కర్లు అంటించుకుని తిరుగుతున్న కార్లను పోలీసులు సీజ్‌ చేశారు. చెన్నై నుంచి కవిటి చేరుకున్న 12 మంది మత్స్యకారుల్ని క్వారంటైన్‌కు తరలించారు.

ఇవీ చదవండి

తెలంగాణలో మరో 43 కరోనా పాజిటివ్ కేసులు నమోదు

Last Updated : Jun 4, 2020, 3:16 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.