కృష్ణా జిల్లా ఉయ్యూరు మండలం గండిగుంటలోని పొన్నం శేఖర్ బాబు ఇంట్లో దొంగలు పడ్డారు. శేఖర్‌బాబు కుటుంబ సమేతంగా అన్నవరం దైవ దర్శనానికి వెళ్లి తిరిగి వచ్చేసరికి ఇంటి తలుపులు తెరుచుకుని ఉన్నాయి. ఇంట్లో దొంగతనం జరిగిందని గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బాధితుని పిర్యాదు మేరకు రూ.7 లక్షల నగదు, 4 కాసుల బంగారు ఆభరణాలు చోరీకి గురయ్యినట్లు.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
ఇది చూడండి: స్వామిజీనంటూ వచ్చాడు.. త్రినేత్రానికి దొరికిపోయాడు!