కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టడంతో పర్యాటక యాత్రలను ఐఆర్సీటీసీ తిరిగి పునరుద్దరించింది. పర్యాటకులకు ఆధ్యాత్మిక క్షేత్రాలు సహా ఉత్తర, దక్షిణ భారతదేశ యాత్రలు చేసే అవకాశం కల్పించింది. దీనికోసం 3 ప్రత్యేక పర్యాటక రైళ్లను ఏర్పాటు చేసినట్లు ఐఆర్సీటీసీ అధికారులు తెలిపారు. తక్కువ ధరలోనే సుదూర ప్రాంతాల్లోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలను దర్శించుకునే భాగ్యం కల్పిస్తున్నట్లు డీజీఎమ్ కిషోర్ సత్య, ఏరియా మేనేజర్ -మురళీకృష్ణ తెలిపారు. ఉత్తర భారతదేశ యాత్ర 10 రాత్రులు, 11 పగళ్లు ఉంటుందని వెల్లడించారు. ఈ నెల 27న తొలి రైలు రేణిగుంట నుంచి మొదలవుతుందని అన్నారు.
ఆగ్రా, మధుర, మాత వైష్ణోదేవి, హరిద్వార్, అమృత సర్, మీదుగా దిల్లీలో యాత్ర ముగియనుంది. కోవిడ్ జాగ్రత్తలు పాటిస్తూ, పరిశుభ్రమైన ఆహారం, చక్కటి వసతి సౌకర్యాలు.. ఏసీ, స్లీపర్ క్లాస్ ప్రయాణంతో పాటు ఇతర సదుపాయాలు కల్పిస్తామని వారు పేర్కొన్నారు. స్లీపర్ క్లాస్ వారికి రూ. 10 వేల 400, ఏసీ కోచ్ ప్రయాణీకులకు రూ. 17వేల 330 రూపాయలుగా రుసుము నిర్ణయించారు. టిక్కెట్లు ఆన్లైన్ ద్వారా www.irctc tourism.comలో పొందవచ్చని తెలిపారు. ఈ అవకాశాన్ని ఆసక్తి కలిగిన వారందరు ఉపయోగించుకోవాలని ప్రజలను కోరారు.
ఇదీ చూడండి: