ETV Bharat / state

హైదరాబాద్​లో ఈ నెల 27 నుంచి పౌల్ట్రీ ఇండియా ప్రదర్శన - 27 నుంచి పౌల్ట్రీ ఇండియా ప్రదర్శన

భాగ్యనగరం మరో అంతర్జాతీయ ప్రదర్శనకు వేదికవుతోంది. హెచ్​ఐసీసీలో 13వ పౌల్ట్రీ యంత్ర ప్రదర్శన... ఈనెల 27 నుంచి మూడు రోజులపాటు జరగనుంది. ఇండియన్​ పౌల్ట్రీ ఎక్విప్​మెంట్​ మానుప్యాక్చరర్స్​ అసోసియేషన్​( ఐపీఈఎంఏ) ఆధ్వర్యంలో ప్రదర్శన నిర్వహించనున్నారు. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్​, పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్​ యాదవ్​ ప్రారంభించనున్నారు.

13th-edition-poultry-india-exhibition-from-27th-onwards-in-hitechs
author img

By

Published : Nov 25, 2019, 11:11 PM IST

హైటెక్స్​లో ఈ నెల 27 నుంచి పౌల్ట్రీ ఇండియా ప్రదర్శన

తెలుగు రాష్ట్రాల్లో వాతావరణ మార్పుల నేపథ్యంలో కోళ్ల పరిశ్రమ వృద్ధి, క్షేత్రస్థాయిలో రైతుల అభ్యున్నతి కోసం ఏటా నవంబర్​లో పౌల్ట్రీ ఇండియా ప్రదర్శన నిర్వహిస్తున్నట్లు ఐపీఈఎంఏ ఛైర్మన్​ చక్రధర్​ తెలిపారు. హైదరాబాద్ లోని హైటెక్స్​లో ఈనెల 27 నుంచి మూడు రోజులపాటు ఈ ప్రదర్శన జరగనుంది. అందులో భాగంగా 26న నాలెడ్జ్​ డే పేరిట సదస్సు నిర్వహిస్తున్నామన్నారు. ప్రదర్శన ఏర్పాట్లపై ఎర్రమంజిల్​ ఎన్​కేఎం గ్రాండ్​ హోటల్​లో చక్రధర్​ వివరాలను వెల్లడించారు.

375 కంపెనీలు..

ప్రపంచ వ్యాప్తంగా కోళ్ల పరిశ్రమ ఎదుర్కొంటున్న సవాళ్ల పరిష్కారం, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేయూత, కేజ్‌ బ్యాన్, చికెన్ దిగుమతి వంటి సమస్యలపై విస్తృతంగా చర్చించనున్నట్లు చక్రధర్ తెలిపారు. కోళ్ల పరిశ్రమలో వస్తున్న విప్లవాత్మక మార్పులు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, యాంత్రీకరణ, ఔషధాలు, పోషకాలపై హైటెక్స్ వేదికగా ప్రదర్శనలు, చర్చలు ఉంటాయన్నారు. దేశవిదేశాల నుంచి 375 కంపెనీలు తమ ఉత్పత్తులను ప్రదర్శిస్తాయని చక్రధర్ పేర్కొన్నారు.

ఇవీ చూడండి:

ఏఐఎఫ్​డీడబ్యూ ప్రథమ మహాసభల గోడ పత్రిక

sample description
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.