Wife Murdered Her Husband in Kona Seema District: దాంపత్య జీవితంలో భర్తకు సహాయం చేస్తూ.. కుటుంబంలో తనవంతు పాత్రను పోషించాల్సిన భార్యే భర్తను హత్య చేసింది. జీవితాంతం తోడుంటుందని భావించిన అతని జీవితాన్ని ఆమె మధ్యలోనే తుడిచివేసింది. భర్త చేస్తున్న పనికి పద్ధతి మార్చుకోమాని ఆమె ఎన్నిసార్లు చెప్పినా అతను వినిపించుకోలేదు. అతను చేస్తున్న ఆ పనికి ఆమె సహానాన్ని కోల్పోయి చివరకి అతన్ని హత్య చేయటానికి పూనుకుంది. చివరకి అత్తమామల సహాయం తీసుకుని భర్తను హత్య చేసింది.
స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. అంబేడ్కర్ కోనసీమ జిల్లా అయినవిల్లి మండలం అయినవిల్లి లంకకు చెందిన ఇసుకపట్ల రామకృష్ణ అనే వ్యక్తిని.. ఆయన భార్య సత్యనారాయణమ్మ హతమార్చినట్లు ఆ గ్రామ ప్రజలు తెలిపారు. గత కొన్ని నెలలుగా రామకృష్ణ మద్యానికి భానిసయ్యాడని వివరించారు. రోజూ అతిగా మధ్యం సేవించి.. ఇంటికి వచ్చి కుటుంబ సభ్యులతో గొడవకు దిగేవాడని అన్నారు. వివాదానికి దిగిన సమయంలో కుటుంబ సభ్యులను ఇబ్బందులకు గురి చేసేవాడని, నానా చిత్రహింసలు పెట్టెవాడని.. అంతేకాకుండా కొట్టెవాడని తెలిపారు.
- Also read: భర్త హత్య.. ఫ్రిడ్జ్‌లో 10 శరీర భాగాలు.. దిల్లీలో మరో 'శ్రద్ధ' తరహా దారుణం
- Also Read: కోడలు, కుమార్తెపై కన్నేశాడని భర్తను కడతేర్చిన భార్య.. శవాన్ని 10 ముక్కలు చేసి..
మద్యం సేవించినప్పుడు కుటుంబ సభ్యులతో వివాదానికి దిగటమే కాకుండా.. భార్య సత్యనారాయణమ్మను చిత్రహింసలకు గురి చేసేవాడని వివరించారు. ఎప్పటిలాగానే ఇప్పుడు కూడా మద్యం తాగి ఇంటికి వచ్చినట్లు స్థానికులు తెలిపారు. దీంతో ఇంట్లో కుటుంబసభ్యుల మధ్య రామకృష్ణకు మధ్య వివాదం చెలరేగిందని గ్రామస్థులు అన్నారు. భర్త ఆగడాలను భరించలేక విసుగుచెందిన భార్య సత్యనారాయణమ్మ భర్తను చెంబుతో తలపై మోదినట్లు వివరించారు. దీంతో తలకు తీవ్రగాయాలైన రామకృష్ణ అక్కడిక్కడే మృతి చెందినట్లు తెలిపారు.
ఈ దాడిలో సత్యనారాయణమ్మకు.. రామకృష్ణ తల్లిదండ్రులు కూడా సహకరించినట్లు గ్రామస్థులు తెలిపారు. కొన్ని నెలల క్రితం నుంచి వారి ఇంట్లో ఇదే తంతూ కావటంతో విసుగు చెంది.. వారు ఈ ఘాతుకానికి పాల్పడినట్లు వివరించారు. హత్య అనంతరం రామకృష్ణ తల్లిదండ్రులు, భార్య స్థానిక పోలీస్ స్టేషన్‌కు వెళ్లి జరిగిన విషయాన్ని పోలీసులుకు వివరించారని.. అనంతరం స్టేషన్లోనే లొంగిపోయారని గ్రామస్థులు అంటున్నారు.
Also Read: ఓ ఇల్లాలి క్రైమ్ కథ.. భర్తను ఎందుకు చంపిందో తెలుసా..!