అమ్మవారి జాతరలో అశ్లీల నృత్య ప్రదర్శనలు ఏర్పాటు చేశారనే ఆరోపణలతో నలుగురు యువకులను తీవ్రంగా కొట్టిన కోనసీమ జిల్లా పి.గన్నవరం ఎస్సైను వీఆర్‌కు పంపుతూ ఎస్పీ ఆదేశాలిచ్చారు. వివరాల్లోకి వెళితే..ఈనెల 18న పి.గన్నవరం పోలీసు స్టేషన్ పరిధిలోని పప్ఫుల వారిపాలెంలో అమ్మవారి జాతర నిర్వహించారు. జాతరలో అశ్లీల నృత్య ప్రదర్శనలు జరుగుతున్నాయన్న సమాచారం మేరకు అక్కడకు వెళ్లిన ఎస్ఐ సురేంద్ర గ్రామానికి చెందిన పప్పుల వెంకట దుర్గా ప్రసాద్, శ్రీను బాబు, ప్రసాద్, నవీన్‌లను అదుపులోకి తీసుకున్నారు.
అశ్లీల నృత్యాలు ఏర్పాటుకు యువకులే కారణమంటూ వారిని స్టేషన్‌కు తరలించి తీవ్రంగా కొట్టారు. తీవ్రంగా గాయపడ్డ యువకులు స్థానిక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ విషయంపై కాపు సామాజిక వర్గ జేఏసీ నాయకులు నిరసన వ్యక్తం చేయటంతో ఎస్సైను వీఆర్‌కు పంపుతూ ఎస్పీ సుబ్బారెడ్డి ఆదేశాలు జారీ చేశారు.
ఇవీ చూడండి