ETV Bharat / state

అమలాపురంలో ప్రశాంతంగా పౌర జీవనం.. కొనసాగుతున్న పోలీసు బందోబస్తు - police reinforcements in amalapuram news

Amalapuram Incident: కోనసీమ జిల్లా అమలాపురంలో ప్రస్తుతం ప్రశాంత వాతావరణంలో పౌర జీవనం కొనసాగుతోంది. అమలాపురం విధ్వంసం ఘటనలో ఇప్పటి వరకు 91 మందిని పోలీసులు అరెస్టు చేశారు. జిల్లా ఎస్పీ సుబ్బారెడ్డి పర్యవేక్షణలో ఎలాంటి ఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు.

అమలాపురంలో ప్రశాంతంగా పౌర జీవనం
అమలాపురంలో ప్రశాంతంగా పౌర జీవనం
author img

By

Published : Jun 3, 2022, 10:37 PM IST

కోనసీమ జిల్లా అమలాపురం విధ్వంసం ఘటనలో ఇప్పటివరకు 91 మందిని అరెస్టు చేశారు. విధ్వంసానికి కారకులైన మరికొంత మందిని అరెస్టు చేసే దిశగా పోలీసులు ముమ్మర గాలింపు చర్యలు చేపట్టారు. మెుత్తం ఏడు బృందాలుగా ఏర్పడి గాలింపు చర్యలు చేపట్టారు. మరో ఏడు బృందాలు ద్వారా అమలాపురంలో పికెట్​లు ఏర్పాటు చేశారు. జిల్లా ఎస్పీ సుబ్బారెడ్డి పర్యవేక్షణలో ఎలాంటి ఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ప్రశాంత వాతావరణంలో పౌర జీవనం కొనసాగుతోంది. అమలాపురం పట్టణంతో సహా ఎనిమిది మండలాల్లో అంతర్జాల సేవలను ఇంకా పునరుద్ధరించలేదు.

ఏం జరిగిందంటే : కోనసీమ జిల్లా అమలాపురం గతనెల 24న ఆందోళనలతో అట్టుడికింది. జిల్లా పేరు మార్పును వ్యతిరేకిస్తూ.. కోనసీమ జిల్లా సాధన సమితి చేపట్టిన ఆందోళన తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. కలెక్టరేట్ కార్యాలయానికి వందలాదిగా చేరుకున్న నిరసన కారులు బస్సులను దగ్ధం చేశారు. పోలీసులపై రాళ్లు రువ్వారు. మంత్రి విశ్వరూప్, ఎమ్మెల్యే సతీశ్ ఇంటికి నిప్పు పెట్టారు. ఈ ఘటనలో పోలీసులతో పాటు పలువురు నిరసనకారులకు గాయాలయ్యాయి.

సెక్షన్‌ 144, 30 పోలీస్‌ యాక్టు ఆంక్షలను లెక్కచేయని ఆందోళనకారులు తీవ్ర నిరసన తెలపడంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. అప్పటివరకు ప్రశాంతంగా ఉన్న అమలాపురం వీధులు వేల మంది ఆందోళనకారులతో నిండి పరిస్థితి చేయిదాటింది. సామాన్యులు, ప్రయాణికులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఉరుకులు పరుగులు తీశారు. నెలన్నర కిందట జిల్లాల విభజనలో భాగంగా కోనసీమ జిల్లాను ప్రకటించిన ప్రభుత్వం.. తాజాగా డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాగా పేరు మారుస్తూ ప్రాథమిక నోటిఫికేషన్‌ విడుదల చేసింది. దీంతో ప్రభుత్వ తీరుపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది.

ఇవీ చూడండి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.