ETV Bharat / state

తేరుకుంటున్న అమలాపురం.. పోలీసుల పటిష్ఠ బందోబస్తు - అమలాపురం తాజా వార్తలు

Kondaseema District Agitation: కోనసీమ జిల్లా పేరు మార్పును నిరసిస్తూ మంగళవారం జరిగిన విధ్వంసం నుంచి అమలాపురం ఇప్పుడిప్పుడే తేరుకుంటోంది. ఎక్కడికక్కడ పోలీసులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు. అల్లర్లకు సంబంధించి 46 మందిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. కోనసీమ ముఖద్వారమైన రావులపాలెంలోనూ భద్రత కట్టుదిట్టం చేశారు.

తేరుకుంటున్న అమలాపురం
తేరుకుంటున్న అమలాపురం
author img

By

Published : May 25, 2022, 8:25 PM IST

తేరుకుంటున్న అమలాపురం

Konaseema: కోనసీమ జిల్లాకు అంబేడ్కర్‌ పేరు పెట్టడాన్ని వ్యతిరేకిస్తూ మంగళవారం జరిగిన ర్యాలీలో ఆందోళనకారులు విధ్వంసం సృష్టించారు. నిరసనకారుల దాడిలో అమలాపురంలోని మంత్రి విశ్వరూప్ నివాసంతో పాటు కొత్తగా నిర్మిస్తున్న ఇల్లు కూడా పూర్తిగా దగ్ధమైంది. ఇంట్లో ఫర్నీచర్ మొత్తం కాలిబూడిదైంది. కేవలం ఐరన్ ర్యాక్‌లు మాత్రమే మిగిలాయి. సీలింగ్ పూర్తిగా కాలిపోయింది. మంటల ధాటికి ఏసీలు, ఫ్యాన్లు పనికిరాకుండా పోయాయి. దాదాపు అరగంటపాటు విధ్వంసం సాగిందని.. ఎవర్నీ నిలువరించలేకపోయామని విశ్వరూప్ ఇంటి వద్ద విధుల్లో ఉన్న సెక్యూరిటీ గార్డు తెలిపారు.

ఆందోళనకారుల దాడిలో దహనమైన ఇంటిని మంత్రి విశ్వరూప్‌ కార్యకర్తలతో కలిసి పరిశీలించారు. హింస వెనుక తెలుగుదేశం, జనసేన ద్వితీయ శ్రేణి నేతలున్నారని మంత్రి ఆరోపించారు. విధ్వంసంపై మంత్రి అనుచరులు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రాణాలతో బయటపడతామని అనుకోలేదని దాడి సమయంలో మంత్రి ఇంట్లో ఉన్న కౌన్సిలర్ దుర్గాబాయి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటన నుంచి ఇంకా తేరుకోలేకపోతున్నానంటూ కన్నీటి పర్యంతమయ్యారు. అమలాపురం ఘటనలో ఇప్పటిదాకా 46 మందిని అదుపులోకి తీసుకున్నామని ఏలూరు రేంజ్ డీఐజీ పాలరాజు చెప్పారు. అన్ని జిల్లాల నుంచి సీనియర్ పోలీసు అధికారులను రప్పించామన్నారు. శాంతి నెలకొల్పే ప్రయత్నంలో అంతా సహకరించాలని కోరారు.

అమలాపురం అల్లర్ల నేపథ్యంలో చలో రావులపాలెం కార్యక్రమానికి అనుమతి లేదని.. పోలీసులు తేల్చిచెప్పారు. అమలాపురంలో జరిగిన దాడులు పునరావృతం కాకుండా ఉండేందుకు పోలీస్ పహారా ఏర్పాటుచేశారు. తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ ఐశ్వర్య రస్తోగి ఆధ్వర్యంలో 300 మందితో చెక్ పోస్టులు ఏర్పాటు చేసి తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో రావులపాలెం రింగ్‌రోడ్డు వద్ద ఎస్పీ రస్తోగి వాహనంపై కొంతమంది ఆందోళనకారులు రాళ్ల దాడికి దిగారు. వెంటనే అప్రమత్తమై పోలీసులు.. వెంబడించడంతో ఆందోళనకారులు పారిపోయారు. అమలాపురం ఘటన నేపథ్యంలో ముందుగానే అప్రమత్తమైన పోలీసులు ఎక్కడివారిని అక్కడే నియంత్రించారు. ప్రజలు ఇళ్లలోనే ఉండాలని, అవసరమైతే తప్ప బయటకు రావొద్దని సూచించారు.

Ravulapalem Tension: కోనసీమలో తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ వాహనంపై కొంతమంది ఆందోళనకారులు రాళ్ల దాడికి దిగారు. జిల్లాలోని రావులపాలెం రింగ్‌రోడ్డు వద్ద ఎస్పీ ఐశ్వర్య రస్తోగి కారుపై ఆందోళనకారులు రాళ్లు రువ్వారు. వెంటనే అప్రమత్తమై పోలీసులు.. వెంబడించడంతో ఆందోళనకారులు పారిపోయారు. కోనసీమ సాధన సమితి ఇవాళ చలో రావులపాలెంకు పిలుపునిచ్చింది. అమలాపురం ఘటన నేపథ్యంలో ముందుగానే అప్రమత్తమైన పోలీసులు ఎక్కడివారిని అక్కడే నియంత్రించారు. ఎవరు కూడా నిరసన కార్యక్రమాలల్లో పాల్గొనకుండా ఆంక్షలు విధించారు.

తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ ఐశ్వర్య రస్తోగి ఆధ్వర్యంలో దాదాపు 300 మంది పోలీసులు పట్టణంలో బందోబస్తు చేపట్టారు. కోనసీమ సాధన సమితి సభ్యులు వినతి పత్రం ఇచ్చేందుకు ఎమ్మార్వో కార్యాలయానికి వెళ్లేందుకు ప్రయత్నించారు. వెంటనే స్పందించిన పోలీసులు వారిని నిలువరించారు. బందోబస్తులో భాగంగా పట్టణంలోని పరిస్థితిని పర్యవేక్షించేందుకు ఎస్పీ కారులో వెళ్తుండగా రావులపాలెం రింగ్‌ సెంటర్‌ వద్ద కొంత మంది యువకులు ఎస్పీ వాహనంపై రాళ్లు విసిరారు. వెంటనే అప్రమత్తమైప పోలీసులు యువకులను వెంబడించడంతో వారు పారిపోయారు. ఈ ఘటనతో పోలీసులు మరింతగా అప్రమత్తం అయ్యారు. కొన్ని చోట్ల యువకులు దాగి ఉండొచ్చని.. ఆందోళనకు దిగొచ్చని భావించిన పోలీసులు వారి కోసం గాలిస్తున్నారు. ప్రస్తుతం రావులపాలెంలో పరిస్థితి అదుపులోనే ఉందని పోలీసులు తెలిపారు.

ఇవీ చూడండి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.