Parked Electric Bike explodes in AP: ఓవైపు ప్రభుత్వం విద్యుత్ ఆధారిత వాహనాలను ప్రోత్సహించడానికి అనేక చర్యలు చేపడుతుంది. మరోవైపు వాటికి తగ్గట్టుగా చర్యలు మాత్రం కనబడటం లేదు. తద్వారా రోజూ ఏక్కడో ఒకచోట విద్యుత్ వాహనం (ఎలక్ట్రికల్ వెహికల్స్-ఈవీ) కాలిపోతున్న దృశ్యాలు టీవీల్లో, వార్తల్లో చూస్తునే ఉన్నాం. ఇలాంటి ఘటనలతో విద్యుత్ వాహనాలను కొనాలంటేనే భయపడాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. రోడ్డుపై వెళ్లుతున్నప్పుడో, ఇంట్లో చార్జింగ్ పెట్టినప్పుడో, లేదా ఇంట్లో పార్కింగ్ చేసినప్పుడో... రోజు ఎలక్ట్రిక్ బైక్ తగలబడి పోయిన ఘటనలు పరిపాటిగా మారిపోయిన సందర్భంలో.. ఆయా కంపెనీలకు చీమకుట్టినట్లుగా ఉండటంలేదు. ఆయా కంపెనీలు వినియోగదారుల ప్రాణాలతో చెలగాటం ఆడేస్తున్నాయి.
అలాంటి ఘటనే అంబేద్కర్ కోనసీమ జిల్లాలో జరిగింది. ఇంటి ముందు పార్కింగ్ చేసిన ఎలక్ట్రిక్ బైక్‌లో నుంచి మంటలు చెలరేగి ఆ వాహనం కాలిపోయిన పరిస్థితి ఏర్పడింది. జిల్లాలోని పి. గన్నవరం మండలం గుడ్డాయి లంక వద్ద ఇంటి ముందు పార్కింగ్ చేసి ఉంచిన ఎలక్ట్రిక్ బైక్ దగ్ధమైంది ఆ సమయంలో స్థానికులు మంటలను అదుపు చేసినప్పటికీ.. అప్పటికే ఎలక్ట్రికల్ పూర్తిగా కాలిపోయింది. దానికి దగ్గరలోనే ఉన్న కారును దూరంగా తీసుకెళ్లడంతో ప్రమాదం తప్పింది.
ఘటనపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎలక్ట్రిక్ బైక్ కాలిపోతున్న దృశ్యాలు వాట్సప్‌లో వైరల్‌గా మారాయి. ప్రమాదం చోటు చేసుకున్న సమయంలో వాహనంపై ఎవ్వరూ లేకపోవడం, బైక్‌ను ఇంటి ముందు పార్కింగ్ చేసి ఉంచడం వల్ల పెను ప్రమాదం తప్పినట్లు తెలుస్తోంది.
ప్రమాదాలకు కారణాలు: బ్యాటరీ లోపల షార్ట్‌సర్క్యూట్ జరగడం కూడా పేలుడుకు కారణమవుతున్నాయి. అలాగే బ్యాటరీల్లో నాసిరకం సెల్స్ ఉండటం, బ్యాటరీ డిజైన్‌లో లోపాలు ఛార్జింగ్ అవుతున్నప్పుడు నియంత్రణ లేని విద్యుత్తు బ్యాటరీకి అందటం కూడా ప్రమాదాలకు కారణాలుగా చెప్పవచ్చు. ఎలక్ట్రిక్ వెహికల్స్ వైరింగ్‌లో తప్పిదాలు, ఫ్యూయల్ లైన్‌లో తేడాలు రావడం కూడా ప్రమాదానికి కారణాలవుతున్నాయి. నిర్దేశిత సమయానికి మించి ఛార్జింగ్ చేయడంతో పాటుగా రాత్రంతా ఛార్జింగ్ పెట్టి వదిలేయడం లాంటి చర్యలు ప్రమాదానికి కారణాలవుతున్నాయి.
ఇవీ చదవండి: