ETV Bharat / state

కోనసీమ జిల్లాలో పంట విరామ ఉద్యమం.. స్వచ్ఛందంగా ముందుకు వస్తున్న రైతులు

Crop Holiday: ధాన్యాగారంలో దైన్యం అలముకుంటోంది. కోనసీమలో 2011 నాటి ‘పంట విరామ ఘట్టం’ పునరావృతమవుతోంది. పెరుగుతున్న పెట్టుబడి ఖర్చులు, తగ్గుతున్న దిగుబడులు, దక్కని మద్దతు ధర, కూలీల కొరత తదితర అంశాలు అన్నదాతల్ని ఈ దిశగా నడిపిస్తున్నాయి. మూడేళ్లుగా వరస నష్టాలే. ఏటికేడు అప్పులు పెరుగుతున్నాయి తప్ప.. ఆదాయం రావట్లేదనే ఆవేదన రైతుల్లో వ్యక్తమవుతోంది. ఇక వరి సాగుతో వేగలేం, ఒక పంట సాగు చేయకపోయినా ఎకరాకు రూ.15వేలు మిగిలినట్లే అని రైతులు అనుకుంటున్నారు. కోనసీమ జిల్లాలోని పలు మండలాల రైతులు.. పంట వేయబోమంటూ ఇప్పటికే తహసీల్దార్లకు వినతిపత్రాలు అందించారు. మరికొన్ని మండలాల రైతులూ ఇదే బాట పడుతున్నారు. ఈ నెల ఒకటో తేదీనే కాలువలకు నీరు విడుదల చేసినా.. ఎక్కడా రైతులు నారుమళ్లకు సిద్ధం కాలేదు. పైగా నాలుగు మండలాల పరిధిలో పంటవిరామానికి తీర్మానాలు చేశారు.

కోనసీమ జిల్లాలో పంట విరామ ఉద్యమం
కోనసీమ జిల్లాలో పంట విరామ ఉద్యమం
author img

By

Published : Jun 7, 2022, 7:10 PM IST

Updated : Jun 8, 2022, 8:54 AM IST

కోనసీమ జిల్లాలో పంట విరామ ఉద్యమం

Crop Holiday: కాలువ కట్టేదెప్పుడు..? విత్తు వేసి...చేను తడిపేదెప్పుడు..? పంట కొంటారు సరే.. తిరిగి డబ్బులిచ్చేది ఎప్పడు..? కోనసీమలో క్రాప్ హాలిడే బాట పట్టిన రైతుల ప్రశ్నలివి..! ఖరీఫ్‌ దృష్ట్యా.. ప్రస్తుతానికి 50 వేల ఎకరాల్లో.. అన్నదాతలు నాగలికి సెలవిచ్చారు..! ఉద్యమం అబద్ధమంటున్న ప్రభుత్వ పెద్దలు వచ్చి...తమ ఆధ్వర్యంలో సాగు చేసి కష్టాలు తెలుసుకోవాలంటూ.. రైతులు ఆహ్వానించారు.

కోనసీమలో 2011లో పురుడు పోసుకున్న క్రాప్ హాలిడే ఉద్యమం....మళ్లీ తెరపైకి వచ్చింది. లాభం సంగతి పక్కన బెడితే...పెట్టిన పైసా పెట్టుబడీ వెనక్కి రావట్లేదంటూ.. రైతులు తొలకరి పంటకు దూరమవ్వాలని నిర్ణయించారు. పంట వేయడం కన్నా మానుకుంటేనే మేలంటూ...నాగలి వదిలేసి ఇంటికి పరిమితం కావడానికి సిద్ధపడుతున్నారు. ఇప్పటికే.. అల్లవరం, ముమ్మిడివరం, ఐ.పోలవరం, కాట్రేనికోన, రాజోలు మండలాలకు చెందిన అన్నదాతలు క్రాప్ హాలిడే ప్రకటించారు.

రైతు పరిరక్షణ సమితి ప్రతినిధుల ఆధ్వర్యంలో.. రైతులు, కౌలు రైతులు అధికారుల్ని కలిసేందుకు వెళ్లగా.. ఎవరూ లేకపోవడంతో నిరాశతో వెనుదిరిగారు. ఖరీఫ్‌ సాగుకు.. 50 వేల ఎకరాల్లో క్రాప్ హాలిడే ప్రకటించామని.. రైతు నేతలు అంటున్నారు. మున్ముందు పెరిగే అవకాశం ఉందని వెల్లడించారు.

ఆరుగాలం కష్టపడి పండించిన పంట కొనుగోలు చేసిన ప్రభుత్వం నెలలు గడిస్తే గానీ డబ్బు చెల్లించడం లేదని.. రైతులు వాపోయారు. విత్తు వేసినా కూలి ఇవ్వలేని పరిస్థితుల్లో ఉన్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం రుణం ఇప్పిస్తామన్నా.. అసలు మొత్తం పక్కనబెడితే వడ్డీ చెల్లించలేమంటున్నారు.

క్రాప్ హాలిడేపై అంటున్న రైతు మాట అబద్ధమని ప్రభుత్వ పెద్దలకు అనుమానం ఉంటే.. వారే వచ్చి తమ ఆధ్వర్యంలో సాగు చేయాలని సూచించారు. ఆ తర్వాతే వారికి రైతు కష్టాలపై స్పష్టత వస్తుందన్నారు. క్రాప్ హాలిడే ఉద్యమానికి..ఏ రాజకీయ పార్టీతోనూ సంబంధం లేదని తేల్చిచెప్పారు.

కోనసీమ జిల్లాలో వరి సాగు విస్తీర్ణం: 1,87,500 ఎకరాలు

పంట విరామం ప్రకటించినది: అల్లవరం, ఐ.పోలవరం, ముమ్మిడివరం, ఉప్పలగుప్తం మండలాల్లో 24,000 ఎకరాలు

రైతులు చెబుతున్న ప్రధాన సమస్యలు:
ఖరీఫ్‌లో: భారీవర్షాలు, వరదల కారణంగా మూడేళ్ల నుంచి రైతులు ఘోరంగా నష్టపోతున్నారు. గతేడాది వర్షాలకు కొన్ని మండలాల్లో గింజ కూడా చేతికి రాలేదు. దీనికితోడు డ్రైనేజి వ్యవస్థ పూర్తి అస్తవ్యస్తంగా తయారైంది. మురుగునీరు ముందుకు పారక.. పొలాలు ముంపు బారిన పడుతున్నాయి.

రబీలో: ఈ సీజన్‌లో పూర్తిస్థాయి సాగునీరు అందడం లేదు. దీంతో దిగుబడులపై ప్రభావం పడుతోంది. మిగిలేదేమీ ఉండటం లేదు.

అమ్మకానికీ అవస్థలే: పండించిన ధాన్యం అమ్ముకోవడానికి ఈ-పంట, రైతు భరోసా కేంద్రాల్లో నమోదు, మిల్లర్ల బేరాల వంటివన్నీ దాటుకుని రావాల్సి వస్తోంది. ఇన్ని కష్టాలు పడినా, మద్దతు ధర రూ.1,455 కాగా.. చివరకు రైతుకు దక్కేది బస్తాకు రూ.1,100 నుంచి రూ.1,250 మాత్రమే. ఇక తడిసిన ధాన్యమైతే రూ.వెయ్యి కూడా రాదు. ఈ సొమ్మయినా 2-3 నెలల వరకూ చేతికి అందడం లేదు. ఈలోగా అప్పులపై వడ్డీ పెరుగుతోంది. ఎప్పుడో 2021 ఖరీఫ్‌లో ధాన్యం అమ్మిన కొందరు రైతులకు... 2, 3 రోజుల కిందటే సొమ్ము జమచేశారు. రబీ ధాన్యానికి రూ.475 కోట్లు రావాల్సి ఉంటే.. రూ.25 కోట్లే రైతులకు అందాయి. ధాన్యం కొనుగోళ్లు పూర్తికాకముందే మళ్లీ పంటకాలం మొదలైపోయింది.

పెరుగుతున్న పెట్టుబడి ఖర్చులు: ఖరీఫ్‌లో వరి సాగుకు ఎకరాకు సగటున రూ.40వేల వరకు ఖర్చవుతోంది. కౌలు రూపంలో ఎకరాకు రెండు పంటలకు కలిపి 22-28 బస్తాలు ఇస్తున్నారు. తొలి పంట సక్రమంగా చేతికొచ్చినా.. ఎకరాకు రూ.15వేల వరకు నష్టపోతున్నారు. గతంతో పోలిస్తే డీజిల్‌ ధరలు 40%, ఎరువుల ధరలు 60% పెరిగాయి. దమ్ము చేయడం, ధాన్యం రవాణా, కోత యంత్రాల వినియోగం వంటివన్నీ పెనుభారంగా మారాయి.

కూలీల సమస్య: వరి సాగు సమయంలో ఉపాధిహామీ పనుల కారణంగా.. కూలీలు దొరకట్లేదు. సమయానికి నాట్లు పడక, కోతలు కోయలేకపోవడంతో.. దిగుబడిపై ప్రభావం పడుతోంది

అప్పుల కొలిమిలో కౌలు రైతులు
సాగు చేసేవారిలో 90% కౌలురైతులే ఉంటున్నారు. ఖరీఫ్‌లో ఎకరాకు 25 బస్తాల దిగుబడి వస్తే.. అందులో 15 బస్తాలు యజమానికి ఇవ్వాలి. మిగిలిన 10 బస్తాలకు వచ్చేది రూ.12వేలే. పెట్టుబడి రూ.35-40వేల మధ్యన ఉంటుంది. అంటే రూ.20వేలకు పైనే నష్టం వస్తోంది. వర్షాలు కురిస్తే గింజ కూడా దక్కదు. ఈ సమయంలో భూయజమానులు కౌలు రద్దుచేసినా.. అప్పులు తప్పట్లేదు. రబీలో ఆశించిన దిగుబడులు రావడం లేదు.

డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తం
ఖరీఫ్‌ సాగును ముంపు నుంచి కాపాడటానికి డ్రైనేజీ వ్యవస్థే కీలకం. డ్రెయిన్లు పూడిపోవడం, ఆక్రమణలకు గురికావడంతో ముంపునీరు దిగక.. రైతులు ఇబ్బందులు పడుతున్నారు. చాలాచోట్ల డ్రెయిన్‌ గట్లను ఆక్రమించి, కాలువలను మూసేస్తున్నారు. దీంతో వర్షాలు, వరదల సమయంలో నీరు ముందుకు పారక.. నష్టపోతున్నామనే ఆగ్రహం రైతుల్లో వ్యక్తమవుతోంది.

రాజకీయ ప్రమేయం లేదు: రైతులు

అమలాపురం పట్టణం, న్యూస్‌టుడే: ‘కొన్నేళ్లుగా ఖరీఫ్‌ గిట్టుబాటు కావడం లేదు. ఉత్పత్తి వ్యయం పెరిగిపోయింది. దీనికితోడు ధర దక్కదు, డ్రెయిన్లు పెద్ద సమస్య. వీటన్నింటిమధ్య మొదటి పంట సాగుచేసి చేతులు కాల్చుకునే కంటే మిన్నకుండటం మేలు. అందుకే ఖరీఫ్‌లో పంట విరామం ప్రకటిస్తున్నాం’ అని కోనసీమ రైతు పరిరక్షణ సమితి స్పష్టం చేసింది. మంగళవారం అమలాపురం ఆర్డీవో కార్యాలయం ఎదుట సమితి ప్రతినిధులు జోలెపట్టి నిరసన వ్యక్తం చేశారు. తమ ఉద్యమానికి రాజకీయ రంగు పులమడం బాధాకరమని, దీనికి ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదని వారు స్పష్టం చేశారు. ఐ.పోలవరం, ముమ్మిడివరం, ఉప్పలగుప్తం మండలాల్లోనూ రైతులు తహసీల్దార్లకు వినతిపత్రాలు అందజేశారు.

పరువు కోసమే వ్యవసాయం - పోలిశెట్టి భాస్కరరావు,గూడాల, అల్లవరం మండలం

సొంత పొలం, కౌలు కలిపి 20 ఎకరాల్లో సాగు చేస్తా. మూడేళ్లుగా వ్యవసాయంపై రూ.3 లక్షల అప్పులు మిగిలాయి. గతంలో నేరుగా మిల్లుకు తోలేవాళ్లం. 300 బస్తాలు తోలితే 200 బస్తాలకు ముందు సొమ్మిచ్చేవారు. తర్వాత మిగిలిన వాటికి ఇచ్చినా పెట్టుబడులకు ఇబ్బంది ఉండేది కాదు. ఇప్పుడు రెండు మూడు నెలలకూ రావడం లేదు. ఇలాగైతే పెట్టుబడి ఎలా? వరి సాగులో ఏమీ మిగలట్లేదు. పరువు కోసమే పొలాన్ని ఖాళీగా వదిలేయలేకపోతున్నాం.

ప్రభుత్వాలు పట్టించుకోలేదు- దామిశెట్టి చంటి, మునిపల్లి గ్రామం, ఉప్పలగుప్తం మండలం

పంటవిరామ ఉద్యమం ఈ రోజు పుట్టలేదు. 2011లో మొదలుపెట్టినా ఏ ప్రభుత్వాలూ మమ్మల్ని పట్టించుకోలేదు. మా బాధలపై మేము మాట్లాడుతున్నాం తప్ప వేరే ఉద్దేశం లేదు.

నెలలు గడిచినా.. ధాన్యం సొమ్ములివ్వరు - సుబ్రహ్మణ్యేశ్వరస్వామి, కౌలు రైతు, కొత్తలంక, ముమ్మిడివరం మండలం

పంట పండించడం ఓ ఎత్తయితే.. దానికి అమ్ముకోవడం మరో ఎత్తులా ఉంది. అమ్మిన ధాన్యానికి డబ్బుల కోసం నెలల తరబడి నిరీక్షించాల్సి వస్తోంది. ఖరీఫ్‌లో వర్షాలకు ప్రతి ఏటా పంటలను నష్టపోతున్నాం. నష్టాలు భరించి ఎన్నాళ్లు సాగు చేయగలం?

రైతులే స్వచ్ఛందంగా ముందుకొస్తున్నారు - లక్ష్మణరావు, కోనసీమ రైతు పరిరక్షణ సమితి, అల్లవరం మండలం

2011లో పంటవిరామం దిశగా ఊళ్లన్నీ తిరిగి రైతుల్ని సంఘటితం చేశాం. ఇప్పుడు రైతులే స్వచ్ఛందంగా పంట విరామం ప్రకటిస్తున్నారు. దీనికి ప్రభుత్వం పార్టీ రంగు పులిమి ఏదో రకంగా భగ్నం చేయాలని చూస్తోంది.

ఇవీ చూడండి

Last Updated : Jun 8, 2022, 8:54 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.