Woman Suicide: ఆమెది నిరుపేద కుటుంబం. మిఠాయి దుకాణంలో పనిచేస్తూ, అరకొర సంపాదనతో కుటుంబ గడవడం కష్టమనుకుంది. గల్ఫ్ దేశానికి వెళ్లి డబ్బులు సంపాదించి ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడాలని భావించింది. ఏజెంట్ల మాట నమ్మి గల్ఫ్ వెళ్లి.. అక్కడ పని ఒత్తిడి తట్టుకోలేక పోయింది. ఇంటికి వచ్చే అవకాశం లేకపోవడంతో..అక్కడే ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన గత నెల 28వతేదీన జరగగా....శనివారం వెలుగులోకి వచ్చింది.
కోనసీమ జిల్లా రాజోలు మండలానికి చెందిన వెంకటలక్ష్మి, ఏజెంట్ జిలానీ ద్వారా ఆరు నెలల క్రితం మస్కట్ వెళ్లింది. అక్కడ పనిఒత్తిడి ఎక్కువగా ఉండటంతో అనారోగ్య సమస్యలు తలెత్తాయి. ఇబ్బందులు తాళలేక స్వదేశానికి వచ్చేస్తానని భర్త నాగరాజుకు ఫోన్ చేసింది. ఈ విషయంపై భర్త ఏజెంట్లను అడిగితే.. వాళ్లు డబ్బులు డిమాండ్ చేశారు. తాము పేదరికంలో ఉన్నామని చెప్పినా పట్టించుకోలేదు. దీంతో స్వదేశానికి వచ్చే మార్గం లేదని తెలిసిన వెంకటలక్ష్మి.. గత నెల 28న భర్తకు వీడియో కాల్ చేసి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. తన భార్యను పంపిన ఏజెంట్లకు గల్ఫ్ దేశాలకు పంపడానికి అనుమతులు లేవని, వారు మోసం చేసి పంపారని మృతురాలి భర్త నాగరాజు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
ఇవీ చదవండి: