ETV Bharat / state

కుటుంబ కథా 'చిత్రం'.. పల్లెల్లోనూ 'ఫొటోషూట్‌' ట్రెండ్‌.. 60ల్లో డ్యూయెట్లు! - ఫొటోషూట్‌ ట్రెండ్‌

Photoshoot Trend: ఒకప్పుడు వివాహాలు, ఇతర పెద్ద వేడుకలకు ఫొటోలు, వీడియోలు తీయించేవారు. ఇప్పుడు షష్టి పూర్తి వేడుకలు, పండగకు కుమార్తెలు, కుమారులు వచ్చినప్పుడు కూడా అవుట్‌డోర్‌ వీడియో, ఫొటో షూట్లకు సై అంటున్నారు. 60 ఏళ్లు దాటినా కొరియోగ్రాఫర్ల సాయంతో డ్యూయెట్లు వేస్తున్నారు. సామాజిక మాధ్యమాల్లో వాటి టీజర్లు విడుదల చేస్తూ ఉత్సుకత రేపుతున్నారు. ఈ కుటుంబ కథా చిత్రాల ఫొటోషూట్‌ ట్రెండ్‌ పల్లెల్లోనూ పరవళ్లు తొక్కుతోంది.

photography stills
photography stills
author img

By

Published : Jul 24, 2022, 4:05 AM IST

ఫొటో.. వేయి పదాల భావాన్నైనా ఒక్క ముక్కలో చెప్పేస్తుంది!
ఫొటో షూట్‌.. నూరేళ్ల జీవితాన్ని ఆస్వాదించేలా అనుభూతులను మేల్కొల్పుతుంది.
వీడియో షూట్‌.. ప్రతి క్షణాన్నీ ఆవిష్కరించి, అపురూప జ్ఞాపకాలను పదిలపరుస్తుంది..
అందుకే చిన్నాపెద్దా అని తేడా లేకుండా ప్రత్యేక రోజుల ప్రస్తావన రాకుండా కెమెరా క్లిక్‌మంటోంది. అమ్మమ్మ తాతయ్యలనూ ఆడిపాడించి వారి కష్టసుఖాలను కాగితాలపైనే కాకుండా డిజిటల్‌ రూపంలో మెరిపిస్తోంది.

.

ఒకప్పుడు వివాహాలు, ఇతర పెద్ద వేడుకలకు ఫొటోలు, వీడియోలు తీయించేవారు. ఇప్పుడు షష్టి పూర్తి వేడుకలు, పండగకు కుమార్తెలు, కుమారులు వచ్చినప్పుడు కూడా అవుట్‌డోర్‌ వీడియో, ఫొటో షూట్లకు సై అంటున్నారు. 60 ఏళ్లు దాటినా కొరియోగ్రాఫర్ల సాయంతో డ్యూయెట్లు వేస్తున్నారు. సామాజిక మాధ్యమాల్లో వాటి టీజర్లు విడుదల చేస్తూ ఉత్సుకత రేపుతున్నారు. ఈ కుటుంబ కథా చిత్రాల ఫొటోషూట్‌ ట్రెండ్‌ పల్లెల్లోనూ పరవళ్లు తొక్కుతోంది.

.

గ్రామాల్లోనూ విస్తరించిన వీడియో, ఫొటోషూట్‌ ట్రెండ్‌కు.. ఫొటోగ్రాఫర్లూ భారీగానే కసరత్తు చేస్తున్నారు. షూట్‌ ఎందుకు చేస్తున్నాం..? తీయించుకునే వారి గత నేపథ్యం.. అన్నీ తెలుసుకుని ఓ థీమ్‌ను సిద్ధం చేసుకుంటున్నారు. దానికి తగిన సెట్టింగులు వెతికి అవసరమైతే స్టూడియోలలో కొన్ని సెట్లను గంటకు ఇంత అని అద్దెకు తీసుకుంటున్నారు. ముందుగా కావాల్సిన స్టెప్స్‌ నేర్పించి ఆ తర్వాత ఫీల్డులో కెమెరాకు పని చెబుతున్నారు. కోనసీమ జిల్లా అయినవిల్లి మండలం సిరిపల్లి గ్రామానికి చెందిన గుత్తుల రామచంద్రరావు గతంలో మిలిటరీలో పని చేశారు. ఇప్పుడు స్వగ్రామంలో వ్యవసాయం చేస్తున్నారు. తన 50వ మ్యారేజ్‌ డేని గోల్డెన్‌ జూబ్లీగా చేసుకోవాలనుకున్నారు. అంతే.. ఫొటోగ్రాఫర్లు దాన్ని ‘జవాన్‌ టు కిసాన్‌’గా ఆకట్టుకునేలా మలిచారు.

.

సాంకేతికత హంగులతో..
తీయబోయే ఫొటో షూట్‌ రుచి చూపించేలా.. మొదట ఓ టీజర్‌ విడుదల చేస్తున్నారు. తరువాత డ్యూయట్‌. అనంతరం ముఖ్య వేడుక చిత్రీకరిస్తున్నారు. ఇందులో అవుట్‌డోర్‌ షూటింగ్‌ది ముఖ్య భూమిక. టీజర్‌, ఆల్బమ్‌, ఫ్రేమ్స్‌, వాట్సప్‌ ఆహ్వానాలు, రీల్స్‌, పాట చిత్రీకరణ అన్ని కలిపి ధరను నిర్ణయిస్తున్నారు. 5 నిమిషాల నిడివి గల టీజర్‌పై ఇప్పుడు అందరూ ఆసక్తి చూపుతున్నారు. జీవితంలో ముఖ్య ఘటనలను అందులో హృద్యంగా చూపించుకుంటున్నారు. దీనికోసం ప్రత్యేక వీడియో కెమెరాలు, డ్రోన్లు, గింబెల్‌, లైటింగ్‌ గొడాక్స్‌, ఆధునిక లెన్స్‌ వినియోగిస్తున్నారు. ఇందుకు ఓ బృందమే పని చేస్తోంది. పాట చిత్రీకరణలో కనీసం ఏడుగురు నాలుగైదు కెమెరాలకు పని చెబుతున్నారు. తీసిన ఫుటేజీకి సినిమాలో ఉపయోగించే సాంకేతికతనూ అద్దుతున్నారు. అవసరమైతే గ్రాఫిక్స్‌నూ జోడిస్తున్నారు.

జవాన్‌ నుంచి కిసాన్‌ వరకు..

"1971లో పాకిస్థాన్‌- ఇండియా యుద్ధం అనంతరం 1972లో మా వివాహమైంది. ఆ క్షణాలు ఇప్పటికీ గుర్తుకొస్తుంటాయి. మాకు అబ్బాయి, అమ్మాయి. ఇద్దరూ స్థిరపడ్డారు. మా 50వ పెళ్లిరోజును పిల్లలతో కలిసి సరదాగా చేసుకుని.. డిజిటల్‌ రూపంలో భద్రపరుచుకున్నాం. అప్పుడు జవాన్‌గా ఇప్పుడు కిసాన్‌గా దేశానికి సేవ చేస్తున్నానని అది చూసినప్పుడు గర్వంగా అనిపిస్తుంది."

- గుత్తుల రామచంద్రరావు, భువనేశ్వరి

జ్ఞాపకాలు మధురంగా ఉండేందుకు..

.

"మాది అనకాపల్లి జిల్లాలోని నక్కపల్లి గ్రామం. మా తల్లిదండ్రులు రుద్రరాజు సూర్యనారాయణరాజు, వెంకటరత్నం. వ్యవసాయ ఆధారిత కుటుంబం. మమ్మల్ని చిన్నప్పటి నుంచి ఎంతో కష్టపడి పెంచారు. మాకు సాఫ్ట్‌వేర్‌ కంపెనీల్లో ఉద్యోగాలు వచ్చాయని చెప్పినప్పుడు వారి కళ్లల్లో ఆనందాన్ని ఎప్పటికీ మర్చిపోలేం. మా అబ్బాయిలు అమెరికాలో ఉన్నారని ఎంతో గొప్పగా చెబుతుంటారు. వారిలో ఒంటరితనాన్ని పోగొట్టేందుకు మా మేనల్లుడు వారితో ఫొటో షూట్‌ తీయించారు. వాటిని మాకు పంపించినప్పుడు మా సంతోషానికి అవధులు లేవు."

- రుద్రరాజు సూర్యవర్మ, కృష్ణవర్మ

సృజనాత్మకతతో ఉపాధి

"పాట చిత్రీకరణకు రూ.40వేలు మొదలుకొని లొకేషన్‌ బట్టి ధర నిర్ణయిస్తాం. ఆల్బమ్‌కు ప్రత్యేక ప్యాకేజీ ఉంటుంది. ఆల్బమ్‌ మోడల్‌ బట్టి కనీసం రూ.60వేలు ఉంటుంది. పిల్లలు, మనవళ్లు, మనవరాళ్లు తమ పెద్దల్లో ఒంటరితనాన్ని పోగొట్టేందుకు ఈ ఫొటో షూట్‌లకు ప్రాధాన్యం ఇస్తున్నారు. ప్రస్తుతం ఫొటో షూట్‌కు సందర్భమంటూ ఏమీ లేదు."

- జి.ప్రవీణ్‌, క్రియేటివ్‌ డైరెక్టర్‌

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.