Nara Lokesh in Dalitha Galam Program: వైసీపీ నేతలు రాక్షసులకంటే క్రూరంగా తమను వేధించి చంపుతున్నారని దళితులు ఆవేదన వ్యక్తం చేశారు. కాకినాడ జిల్లాలో దళిత గళం పేరిట నారా లోకేశ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ముఖాముఖిలో పాల్గొన్న బాధితులు.. తమ గోడు వెళ్లబోసుకున్నారు. వారిని ఓదార్చిన లోకేశ్.. జగన్ పాలనలో 6వేల మందిపై దాడులు జరిగాయన్నారు. వాటికి కారకులను అధికారంలోకి వచ్చిన వెంటనే శిక్షిస్తామని హామీ ఇచ్చారు. వైసీపీ రద్దు చేసిన పథకాలను 100 రోజుల్లో పునరుద్ధరిస్తామని భరోసా ఇచ్చారు.
జగన్ ముఖ్యమంత్రి అయ్యాక దళితులపై దాడులు పెరిగిపోయాయని.. గొంతెత్తి మాట్లాడే పరిస్థితి లేదని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ ధ్వజమెత్తారు. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో 215 వ రోజు యువగళం పాదయాత్ర నిర్వహించిన లోకేశ్.. యు. కొత్తపల్లి మండలం శీలంవారిపాకలలో దళిత గళం పేరిట ముఖాముఖి నిర్వహించారు. ఈ కార్యక్రమానికి దళిత నాయకుడు మహాసేన రాజేశ్ సంధానకర్తగా వ్యవహరించారు. ఈ సభలో ప్రజల సమస్యలకు లోకేశ్ ఓపిగ్గా సమాధానాలు చెప్పారు.
చేనేతలకు లోకేశ్ హామీ - 200 యూనిట్ల ఉచిత విద్యుత్
"దళిత సోదరులందర్ని ఒక్కసారి ఆలోచించమని కోరుతున్నా. సామాజిక న్యాయం అనేది కేవలం తెలుగుదేశం పార్టీ వల్లనే సాధ్యం. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దళితుల కోసం 40 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేశాము." - నారా లోకేశ్
దళిత గళం కార్యక్రమానికి హాజరైన డ్రైవర్ సుబ్రహ్మణ్యం తల్లిదండ్రులు.. లోకేశ్ ఎదుట తమ బాధను వ్యక్తం చేశారు. వారిని ఓదార్చిన లోకేశ్.. అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. కోడికత్తి కేసులో ఆరేళ్లుగా శ్రీనివాస్‌ను బైటకు రానీయకుండా వైసీపీ ప్రభుత్వం అడ్డుపడుతోందని అతడి కుటుంబ సభ్యులు లోకేశ్ ఎదుట వాపోయారు. శ్రీను కుటుంబాన్ని పరామర్శించిన లోకేశ్ అండగా ఉంటానన్నారు.
యువగళం పాదయాత్ర ముగింపు సభ - హాజరుకానున్న చంద్రబాబు, పవన్ కల్యాణ్
"మా బిడ్డను కోల్పోయి ఇంట్లో ఉన్న సమయంలో మాకు చంద్రబాబు ఓదార్పునిచ్చారు. 5లక్షల ఆర్థిక సహాయం చేశారు. మాకు న్యాయం జరుగుతుందని నమ్ముతున్నాం."- నూకరత్నం, సుబ్రహ్మణ్యం తల్లి
హత్యలకు దిగితే ఇప్పటికి చర్యలు లేవు: సంక్షేమ పథకాలను వైసీపీ ప్రభుత్వం పెద్ద ఎత్తున రద్దు చేసి దళితుల ఉసురు తీసిందని లోకేశ్ మండిపడ్డారు. మాస్కు అడిగినందుకు డాక్టర్ సుధాకర్‌ను చంపేశారని.. చీరాలలో మాస్కు పెట్టుకోలేదని కిరణ్‌ను హత్య చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. నెల్లూరులో మహిళ దుస్తులు మార్చుకుంటుంటే వీడియోలు తీసి బయటపెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గుంటూరు జిల్లాలో రమ్యను, సీఎం సొంత జిల్లాలో నాగమ్మను హత్యచేస్తే నేటికీ చర్యలు లేవన్నారు. తెలుగుదేశం- జనసేన కలిసి అధికారంలోకి రాగానే ఇందుకు కారకులైన వారందరినీ శిక్షిస్తామంటూ లోకేశ్ భరోసా ఇచ్చారు.
ఉత్సాహంగా సాగిన లోకేశ్ పాదయాత్ర- అడుగడుగునా నిరాజనం పలికిన యువత, మహిళలు