Indian Institute of Foreign Trade in Kakinada: కాకినాడలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ ( ఐఐఎఫ్‌టీ)ని కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్, కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పియూష్ గోయల్ ప్రారంభించారు. కాకినాడ జేఎన్టీయూలో తాత్కలికంగా ఏర్పాటు చేసిన ఐఐఎఫ్‌టీ దక్షిణాదిలోనే తొలి క్యాంపస్. ఐఐఎఫ్‌టీ ఏర్పాటుతో వాణిజ్య ఎగుమతుల హబ్‌గా కాకినాడ దేశ ఆర్థిక వ్యవస్థలో మరింత కీలక పాత్ర పోషిస్తుందని నిర్మాలా సీతారామన్ అన్నారు. ఐఐఎఫ్‌టీ విద్యార్థులు తమ కోర్సును కేవలం అకాడమిక్ డిగ్రీ సాధనలా కాకుండా ప్రపంచ వాణిజ్య స్థితిగతులు, సదావకాశాలను అధ్యయనం చేసి దేశ ఆర్థిక పురోగగతిలో భాగస్వాములు కావాలని ఆకాంక్షించారు. దేశ వాణిజ్యానికి మేనేజ్మెంట్ నిపుణులు అవసరం ఎంతో ఉందని.. అది ఐఐఎఫ్‌టీ తీర్చగలదని మంత్రి పియూష్ గోయల్ అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు బుగ్గన, సీదిరే అప్పలరాజు, వేణుగోపాలకృష్ణ, దాడిశెట్టి రాజా, కారుమూరి నాగేశ్వరరావు.. మెుదలైన నాయకులు పాల్గొన్నారు.
ఇవీ చదవండి: