ETV Bharat / state

కొత్తపల్లిలో అంతుచిక్కని సమస్య.. ఏడుగురు విద్యార్థినులకు అస్వస్థత

Seven girls ill at school: ఆ పాఠశాలలో ఏడుగురు బాలికలు అస్వస్థతకు గురయ్యారు. ఒక్కసారిగా కుప్పకూలి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడ్డారు. అస్వస్థతకు గురైన  బాలికలను పీహెచ్‌సీకి తరలించారు.  ఆస్పత్రిలో ఆక్సిజన్‌ సౌకర్యం కేవలం ఒకరికే ఉండటంతో శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిపడుతున్న నలుగురు బాలికలను.. రెండు అంబులెన్సుల్లో కాకినాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఘటనకు సంబంధిచిన అంశాన్ని గోప్యంగా ఉంచిన టీచర్లపై చర్యలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

girls ill at school
ఏడుగురు బాలికలకు అస్వస్థత
author img

By

Published : Oct 23, 2022, 3:35 PM IST

Kothapally ZP School: కాకినాడ జిల్లా కొత్తపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గత 20 రోజులుగా వింత సమస్యతో బాలికలు బాధపడుతున్న విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఒక్కసారిగా కుప్పకూలి క్షణాల్లో శ్వాస తీసుకోవడంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యతో బాధపడుతున్న ఏడుగురు బాలికలను ఆదివారం కొత్తపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. అక్కడ వైద్య అధికారులు బాలికలకు చికిత్స అందించినా.. సమస్య తగ్గకపోవడంతో బాలికలు తీవ్ర ఇబ్బంది పడ్డారు.

ఏడుగురు అమ్మాయిలకు అస్వస్థత ఆసుపత్రికి తరలింపు

మాజీ ఎమ్మెల్యే వర్మ ఆగ్రహం: విషయం తెలుసుకున్న తెదేపా రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి చేరుకుని విద్యార్థినులను పరిశీలించారు. ఏడుగురు బాలికలు శ్వాస తీసుకోవడంలో బాధపడుతుంటే ఒకటే ఆక్సిజన్ కిట్ ఉండడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకే కిట్టుతో ఒకరి తర్వాత ఒకరికి ఆక్సిజన్ అందిస్తే మిగిలిన వారికి ఏదైనా అయితే ఎవరు బాధ్యత వహిస్తారని వైద్యాధికారులపై మండిపడ్డారు. తక్షణమే బాలికలను కాకినాడ తరలించాలని డిమాండ్ చేశారు. దీంతో వైద్యాధికారులు రెండు అంబులెన్స్ వాహనంలో తీవ్రంగా బాధపడుతున్న నలుగురు బాలికలను కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేంద్రంలో అవసరమయ్యే మందులు, సామాగ్రి లేకపోవడంతో ఇది ప్రభుత్వం వైఫల్యమంటూ విమర్శించారు.

ఇది జరిగింది: కొత్తపల్లి జడ్పీ పాఠశాలలో నెలరోజుల క్రితం ఒక విద్యార్థినికి ఇదే సమస్య వచ్చింది. అనంతరం ఈ సమస్యతో బాధపడుతున్నారు. ఎందుకు ఇలా జరుగుతుందో ఎవరికీ తెలియదు. విద్యార్థులు ప్రతిరోజు ఇంతలా బాధపడుతుంటే విషం పైకి తెలియని కొండ ఉపాధ్యాయులు గోప్యంగా ఉంచారు. ఈ విషయాన్ని సోమవారం ఈనాడులో 'అక్కడ విద్యార్థులకు ఏమవుతుంది' అనే కథనం ప్రచురించడంతో విషయం బయటకు తెలిసింది.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.