MOTHER: కుమారుడు, కోడలు ఇంటి నుంచి గెంటేసి బాధలు పెడుతున్నారని.. కారుణ్యమరణానికి అనుమతించాలంటూ కాకినాడ జిల్లా ఎస్పీకి ఓ తల్లి విజ్ఞప్తి చేసింది. కాకినాడ గ్రామీణ మండలం గైగోలపాడుకు చెందిన 62ఏళ్ల అచ్చాయమ్మకు ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు తన కుటుంబంతో వేరే ఉంటున్నారు. చిన్న కుమారుడు యేసేబు, రెండో భార్య ప్రశాంతి కలిసి.. తన ఇంటిని వారి పేరిట రాయాలంటూ నిత్యం వేధిస్తున్నారని.. దీనిపై సర్పవరం పోలీసులకు ఫిర్యాదు చేశానని అచ్చాయమ్మ చెప్పారు.
అయితే.. ఇప్పుడు ఇంటికి తాళం వేసి, తనను ఇంటి నుంచి గెంటేశారని ఆవేదన వ్యక్తంచేశారు. తనను చంపేస్తామని బెదిరిస్తున్నారని.. వారి చేతుల్లో చనిపోయేకంటే తానే చనిపోతానని ఎస్పీని వేడుకున్నారు. కారుణ్య మరణానికి అనుమతించాలని విజ్ఞప్తి చేశారు.
ఇవీ చదవండి: