గుంటూరు జిల్లా తాడికొండ నియోజకవర్గ వైకాపాలో విభేదాలు రచ్చకెక్కాయి. ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవిపై సొంత పార్టీ నేతలు తిరుగుబాటు చేశారు. ఎమ్మెల్యే ఏకపక్ష వైఖరికి వ్యతిరేకంగా నియోజకవర్గంలోని పలు మండలాలు, గ్రామాల్లోని ముఖ్యనాయకులు గుంటూరులో సమావేశమయ్యారు.
పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్న నేతల్ని పక్కన పెట్టి...ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి ఏకపక్ష ధోరణితో వ్యవహరిస్తున్నారని.... వైకాపా నాయకులు మండిపడ్డారు. పార్టీ కోసం కష్టపడే వారిని పట్టించుకోవటం లేదని ధ్వజమెత్తారు. ముఖ్య నాయకులతో సంప్రదించకుండా నిర్ణయాలు తీసుకోవటం వల్ల కార్యకర్తలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఈ అంశాల్ని ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లినా ప్రయోజనం లేకుండా పోయిందన్నారు. పద్ధతి మార్చుకోకుంటే పార్టీ అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్లతామని స్పష్టం చేశారు.
ఇదీ చదవండి : ఆ గ్రామం జనసేన పార్టీ గుండెల్లో ఎప్పటీకీ ఉంటుంది: నాగబాబు