YSRCP Government Did Not Provide YSR Rythu Bharosa to Tenant Farmers : 2019 జులై 8న "మీ ఆత్మబంధువు" జగన్ పేరిట. 15.36 లక్షల మంది కౌలు రైతులకూ వైఎస్సార్ రైతు భరోసా (YSR Rythu Bharosa) అందిస్తామంటూ ముఖ్యమంత్రి జగన్ (Chief Minister Jagan) కౌలు రైతుల్ని ఉద్దేశిస్తూ రాసిన లేఖ గుర్తుందా? మరి నిజంగా ఆ హామీని అమలు చేస్తున్నారా అంటే లేదనే చెప్పాలి. మాట తప్పను.. మడమ తిప్పను అంటూ చెప్పే ముఖ్యమంత్రి.. కౌలు రైతులకు సాయం విషయంలో పూర్తిగా మడమ తిప్పేసారు. సీఎం జగన్ హామీ ప్రకారం 15.36 లక్షల మంది కౌలు రైతులకు ఏడాదికి 13వేల 500 చొప్పున రైతు భరోసా చెల్లిస్తే 2వేల 73 కోట్లు ఖర్చవుతుంది. అంటే అయిదేళ్లలో 10వేల 365 కోట్లు. వాస్తవానికి ఈ అయిదేళ్లలో ఆయన కౌలు రైతులకు ఇచ్చిన భరోసా కేవలం 697 కోట్లు మాత్రమే. అంటే ఒక్క ఏడాదికి ఇవ్వాల్సిన మొత్తంలో మూడో వంతు కూడా కౌలు రైతుల ఖాతాల్లో జమ చేయలేదు. ఏడాదికి 13వేల500 కూడా ఇవ్వలేకపోతే రైతులు తమ పంటలకు ఎలా పెట్టుబడి పెడతారంటూ కపట ప్రేమ ఒలకబోసిన ముఖ్యమంత్రికి.. మరి కౌలు రైతుల బాధలు పట్టడం లేదా..లేక కావాలనే విస్మరిస్తున్నారా అని రైతులు పెదవి విరుస్తున్నారు.
CM Jagan Forget Their Promises to Tenant Farmers : రాధాకృష్ణ కమిషన్ (Radhakrishna Commission) లెక్కల ప్రకారం రాష్ట్రంలో 24 లక్షల మందికి పైగా కౌలు రైతులు ఉన్నారు. అయితే జగన్ మాత్రం ఏడాదికి 15.36 లక్షల మందికి ఇస్తామని హామీ ఇచ్చారు. అమల్లోకి వచ్చే సరికి ఆ విషయాన్ని సీఎం జగన్ విస్మరించారు. ఏడాదికి సగటున 1.07 లక్షల మందికి మాత్రమే ఇచ్చి సరిపెడుతున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కౌలు రైతులతో (Tenant Farmers) పాటు ఆర్‌ఓఎఫ్‌ఆర్ రైతులకు సాయం అని చెబుతున్నా.. వాస్తవంగా వారిలోనూ అందరికీ భరోసా కల్పించడం లేదు. సీసీ కార్డులను అందించడంలోనే మెలిక పెడుతున్నారు.
కౌలు రైతు గోడు ప్రభుత్వానికి పట్టదా? సాగునీరు లేక బ్యాంకు రుణాలు రాక అవస్థలు
Tenant Farmers Problems in AP : వివిధ రకాల నిబంధనలతో కొర్రీలు పెడుతూ కార్డులు ఇవ్వడం లేదు. మొత్తంగా చూస్తే కౌలు రైతులకు ఇచ్చిన హామీలోనే 93 శాతం మందికి జగన్ కోత పెట్టారు. కేవలం 7 శాతం మందికి మాత్రమే ఏడాదికి 13వేల500 చొప్పున రైతు భరోసా జమ చేస్తున్నారు. 2020-21, 2021-22 సంవత్సరాల్లో అయితే సగటున లక్ష మందికి కూడా జగన్ ప్రభుత్వం రైతు భరోసా ఇవ్వలేకపోయింది. ఎన్నికల ఏడాది కావడంతో.. అర్హుల సంఖ్యను కొద్దిగా పెంచారు. అయినప్పటికీ 1.50 లక్షల మందిని కూడా అర్హులుగా తేల్చలేకపోయింది.
YSRCP Government Cheating Tenant Farmers: ఇచ్చిన హామీలపై చేతులెత్తేసిన సీఎం జగన్.. పంట రుణాలు దక్కడం లేదని కౌలురైతుల ఆవేదన
93 శాతం నిధులకు కోత : సీఎం జగన్ ఇచ్చిన హామీ వందశాతం అమలైతే కౌలు రైతులకు ఏడాదికి 2వేల73 కోట్లు దక్కుతాయి. అయితే ఆయన ఏడాదికి సగటున 140 కోట్ల లోపుగానే రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నారు. ఇస్తామన్న మొత్తంలో 93శాతం నిధులకు కోత పెట్టేశారు. అంటే ఏడాదికి ఒక వెయ్యి 933 కోట్లు మిగుల్చుకున్నారు. అయిదేళ్లలో చూస్తే 9వేల 665 కోట్ల మేర కౌలు రైతులకు బాకీ పడ్డారు. ఇంత మోసం చేస్తూ కూడా కౌలు రైతులకు ఎంతో గొప్ప మేలు చేస్తున్నామని, అన్ని రకాల ప్రయోజనాలు కల్పిస్తున్నామని వారిని జగన్ నమ్మబలికే ప్రయత్నం చేస్తున్నారు.
Tenant Farmers Difficulties in Andhra Pradesh : రాష్ట్రంలోని కౌలు రైతుల్లో అత్యధికంగా నిరుపేద కుటుంబాల వారికి చెందినవారే ఉన్నారు. సగటున ఒక్కో రైతు 3 నుంచి 4 ఎకరాలు కౌలుకు తీసుకుని సాగు చేస్తున్నారు. ఎకరాకు కనీసం 30వేల చొప్పున పెట్టుబడి ప్రకారం చూసినా కనీసం లక్షకు పైగానే ఖర్చు పెడుతున్నారు. వర్షాలు, వరదలు, కరవులతో పంట చేతికి రాక.. పెద్దఎత్తున నష్టపోతున్నారు. వారిపట్ల ఉదారంగా వ్యవహరించాల్సిన ప్రభుత్వం.. కనీసం కౌలురైతు కార్డులు అందిద్దామనే ఆలోచన కూడా చేయడం లేదు. వారికి రాయితీ విత్తనాలివ్వడం లేదు. పెట్టుబడి రాయితీ, పంటల బీమా ప్రయోజనాలూ కల్పించడం లేదు. రైతు భరోసా కింద 13వేల 500 సాయం కూడా కౌలు రైతులకు అందించకుండా జగన్ ప్రభుత్వం వారిని మరింత కష్టాల్లోకి నెడుతోంది.
Tenant farmers Problems: సమస్యలన్నీ పరిష్కరిస్తానన్న జగన్.. మాపై చిన్నచూపు ఎందుకంటున్న కౌలురైతులు