YSRCP Government Cut SC, ST Schemes in Andhra Pradesh : ఏ సభలో చూసినా నా ఎస్సీ, నాఎస్టీ అంటూ సీఎం జగన్ (CM Jagan) ఊదరగొడుతున్నారు. నా ఎస్టీ అంటూ తియ్యటి మాటలు చెప్పే సీఎం జగన్ (CM Jagan) చేతల్లో చేటు తలపెడుతున్నారు. ఆయన ఆప్యాయత వెనక.. అట్టడుగు వర్గాలు స్వయంగా ఎదగకుండా తన దయాదాక్షిణ్యాలపైనే ఆధారపడి బతికేలా దురాలోచన ఉంది. ఎస్టీలకు అందుతున్న నాణ్యమైన విద్య, ఏళ్లుగా అమలవుతున్న ప్రత్యేక పథకాలను రద్దుచేసి సొంతగా ఎదిగే అవకాశాల్లేకుండా చేస్తోంది. అందులో మొదటగా చెప్పుకోవాల్సింది కుల కార్పొరేషన్ల నిర్వీర్యం.
CM Jagan Completely Avoiding SC ST Welfare : కార్పొరేషన్ల ద్వారా స్వయం ఉపాధి రాయితీ రుణాలు పొంది ఎన్నో వేల ఎస్సీ, ఎస్టీ కుటుంబాలు పేదరికాన్ని జయించాయి. అలాంటి కుల కార్పొరేషన్లనను జగన్ అధికారంలోకి రాగానే ఒక్క కలంపోటుతో నిర్వీర్యం చేశారు. ఎస్సీ కార్పొరేషన్‌ను మాల, మాదిగ, రెల్లీ కార్పొరేషన్లుగా విభజించి వారికి మేలు చేస్తున్నట్లు చిత్రీకరించారు. వీటిలోడైరెక్టర్లుగా, ఛైర్మన్లుగా పార్టీ నేతలకు ఇబ్బడిముబ్బడిగా రాజకీయ పదవులు కట్టబెట్టి ఆ కార్పొరేషన్లను రాజకీయ పునరావాస కేంద్రాలుగా మార్చారు. పోనీ వాటి ద్వారా ఎస్సీ ఎస్టీలకు ఏమైనా లాభం చేకూర్చారా అంటే అదీ లేదు. ఆయా కార్పొరేషన్ల ద్వారా రాయితీ రుణాల మంజూరే లేకుండా చేశారు.
YCP Neglecting SC ST BC Communities: నా ఎస్సీ, ఎస్టీలు.. నా బీసీలంటూ గొప్పలు.. చేతల్లో మొండిచేయి
ఒక్క రూపాయి ఇవ్వకుండా పథకాన్ని ఆపేశారు : నవరత్న పథకాల నిధులనే బదిలీ చేస్తూ అంకెల గారడీతో జగన్ నిలువునా ఎస్సీ ఎస్టీలను వంచిస్తున్నారు. వైసీపీ అధికారం చేపట్టిన తొలి ఏడాది ఎస్సీ, ఎస్టీ కార్పొరేషన్ల ద్వారా దాదాపు వెయ్యి కోట్ల రూపాయల రాయితీ రుణాలివ్వాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఒక్కరికీ ఒక్క రూపాయి రాయితీ రుణం ఇవ్వకుండా ఈ పథకాన్నే నిలిపేశారు. అంతేకాదు గత ప్రభుత్వం స్వయం ఉపాధి కోసం ఇచ్చిన రాయితీ సొమ్ము 750 కోట్లు బ్యాంకుల్లో ఉంటే ఆ పథకాన్ని కొనసాగించకుండా దాన్నీ వెనక్కి తీసుకున్నారు. ఇందులో ఎస్సీలకు సంబంధించిన నిధులే రూ.200 కోట్లున్నాయి.
SC, ST Welfare in AP : దశాబ్దాలుగా కేంద్ర సహకారంతో సబ్సీడీ రుణాల కింద రాష్ట్ర ప్రభుత్వాలు ఎస్సీలకు భూమి కొనుగోలు పథకాన్ని అమలు చేశాయి. ఒక్కో ఎస్సీ కుటుంబానికి సుమారు ఎకరం పొలం కొనుగోలు చేసి సాగు చేసేందుకుఇచ్చాయి. 3 దశాబ్దాలుగా వేల మంది ఎస్సీ మహిళలకు అండగా ఉన్న ఈ పథకాన్ని వైసీపీ అధికారం చేపట్టాక నిలిపేసింది. ఇదే కాదు కేంద్ర ప్రభుత్వ సంస్థలైన జాతీయ ఎస్సీ ఆర్థికాభివృద్ధి సంస్థ, జాతీయ గిరిజన ఆర్థికాభివృద్ధి సంస్థలు ఎస్సీ, ఎస్టీలకు అందించే రుణాలకూ జగన్ ప్రభుత్వం మోకాలడ్డింది.
ఎన్నికల ముంగిట ఓట్ల ఎత్తుగడ వేసిన జగన్ : ఎస్సీ, ఎస్టీలకు కేంద్రం ఇచ్చే నిధులకు తన వంతు వాటా కలిపి రుణాలివ్వకుండా దశాబ్దాలుగా అమలవుతున్న పథకాలకు మంగళంపాడింది. 2015-19 వరకూ రాష్ట్రంలో దాదాపు 23 వేల ఎస్సీ, ఎస్టీలకు రూ.515 కోట్లకుపైనే సాయం అందింది. 2020-21 ఆర్థిక సంవత్సరంలో జాతీయ ఎస్సీ ఆర్థికాభివృద్ధి సంస్థ టర్ము రుణాల కింద రాష్ట్రానికి రూ.6.54 కోట్లు కేటాయించినా రాష్ట్ర ప్రభుత్వం రాయితీ ఇవ్వలేదు. ఎన్నికలు దగ్గర పడుతుండడంతో జాతీయ సఫాయి కర్మచారీ ఆర్థికాభివృద్ధి సంస్థ ద్వారా కేంద్రమిచ్చిన రూ.38 కోట్ల నిధులతో తాజాగా 100 మంది లబ్ధిదారులకు మురుగు శుద్ధి వాహనాలను పంపిణీ చేశారు. ఇందులోనూ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది ఒక్క రూపాయి కూడా లేదు.
SC, ST Schemes in Andhra Pradesh : ప్రతిభావంతులైన ఎస్సీ, ఎస్టీ పిల్లల కోసం పాతికేళ్లుగా రాష్ట్రంలో బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ పథకం అమలవుతోంది. గత టీడీపీ ప్రభుత్వం ఈ పథకానికి ఏటా రూ.100 కోట్లు ఖర్చు చేసి దాదాపుగా లక్ష మంది ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించింది. ఈ పథకాన్ని జగన్ ప్రభుత్వం నిర్వీర్యం చేసింది. ప్రైవేటు కళాశాలల్లో పీజీ చదివే విద్యార్థులకు ఫీజురీయింబర్స్‌మెంటునూ రద్దు చేసింది. విదేశీ విద్యా దీవెన పథకాన్ని సైతం పేద ఎస్సీ, ఎస్టీ వర్గాలకు అందకుండా, ఎక్కడ లేని నిబంధనలు వెతికి మరి తెచ్చి వారు అర్హతకే నోచుకోకుండా చేశారు. ఇది పైకి కనిపించకుండా ఆర్థిక సాయం పెంచి అమలు చేస్తున్నట్టు ప్రచారం చేస్తున్నారు. విదేశీ విద్యాదీవెన పథకం కింద టీడీపీ ప్రభుత్వం 491 మంది ఎస్సీ, ఎస్టీలకు ఆర్థిక సాయమందిస్తే జగన్ ప్రభుత్వం లబ్ధి చేకూర్చిన ఎస్సీ, ఎస్టీల విద్యార్థుల సంఖ్య 40 కూడా మించలేదు.
టీడీపీ ప్రభుత్వం సాయం : ఇక ఎస్సీ, ఎస్టీలు అత్యున్నత కొలువులు సాధించేందుకు దేశంలోనే పేరెన్నికగన్న కోచింగ్ సెంటర్లలో సివిల్స్ సర్వీసెస్ పరీక్షలకు ఉచిత శిక్షణ ఇప్పించేందుకు ఉద్దేశించిన విద్యోన్నతి పథకాన్నీ జగన్ నిలిపేశారు. గత ప్రభుత్వం ఒక్కో విద్యార్థిపై రూ.లక్షకుపైగా ఖర్చు పెట్టి శిక్షణ ఇప్పించింది. దాదాపుగా 2వేల500 మందికి ఆర్థిక సాయం అందించింది.
నామమాత్రంగా స్టడీ సర్కిళ్లు : ఎన్నికలు దగ్గర పడుతున్నాయనే ఆలోచనతో, జగన్ కొత్త ఎత్తుగడ వేశారు. సివిల్స్ సర్వీసెస్ పరీక్షల్లో ఉత్తీర్ణులయ్యేందుకు ఉచితంగా శిక్షణ ఇవ్వకుండా ప్రిలిమ్స్, మెయిన్స్‌కు అర్హత సాధించిన వారికి ఆర్థికసాయం అందిస్తామనేలా ప్రోత్సాహక పథకాన్ని తెచ్చారు. ఎన్నికల నాటికి దీని ద్వారా అందే సాయమూ పరిమితం కానుంది. ఇదే కాకుండా వివిధ పోటీ పరీక్షలకు ఉచితంగా ఉద్యోగ శిక్షణ ఇచ్చే స్టడీ సర్కిళ్లనూ రాష్ట్రంలో నామమాత్రం చేశారు.
సంక్షేమ హాస్టళ్లలో సంక్షోభం : రాష్ట్రంలో బడుగుబలహీన వర్గాల సంక్షేమం ఎలా సంక్షోభంలో పడిందో ఆయా గురుకులాల్లో వసతులు చూస్తే తెలుస్తుంది. 400 మంది పిల్లలున్న కోనసీమ జిల్లా గోడి గురుకుల పాఠశాలలో రెండంటే రెండే టాయిలెట్లు ఉన్నాయి. కనీసం కప్పుకోడానికి దుప్పట్లు కూడా సరిపడా ఇవ్వలేదు.
Anarchies on Dalits: అధికార వైఎస్సార్సీపీ పాలనలో.. దళిత, గిరిజనులపై అరాచకాలు.. నెలకు ముగ్గురి హత్య