గుంటూరు జిల్లా రేపల్లె నియోజకవర్గంలో దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి మంత్రి మోపిదేవి వెంకటరమణ రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ... ప్రభుత్వ పథకాలు ప్రజలందరికీ చేరే విధంగా సీఎం జగన్మోహన్ రెడ్డి కృషి చేస్తున్నారని తెలిపారు. సంవత్సరం పాటు పాదయాత్ర నిర్వహించి ప్రజల కష్టాలను తెలుసుకున్న ఏకైక నాయకుడు జగన్ అని కొనియాడారు. తదనంతరం మంత్రి మోపిదేవి... అర్హులైన వారికి పింఛన్లు, విద్యార్థినులకు సైకిళ్లు పంపిణీ చేశారు.
ఇవి చూడండి: ఈ కిళ్లీలు టేస్టీ, హెల్దీ.. మీరు తింటారు మళ్లీ మళ్లీ!