ETV Bharat / state

రాజధాని కోసం యువజన జేఏసీ 12 గంటల దీక్ష

author img

By

Published : May 15, 2020, 6:12 PM IST

అమరావతి రాజధాని పరిరక్షణ కోసం అమరావతి పరిరక్షణ యువజన జేఏసీ ఆధ్వర్యంలో గుంటూరులో 12 గంటల నిరాహార దీక్ష చేపట్టారు. రాష్ట్ర భవిష్యత్తు కోసం పోరాడుతున్న అమరావతి రైతులు, మహిళలకు సంఘీభావం తెలిపిన అనంతరం జేఏసీ సభ్యులు దీక్షలో కూర్చున్నారు.

Youth JAC 12 hour hunger strike  for capital amaravati
రాజధాని కోసం యువజన జేఏసీ 12 గంటల దీక్ష

అమరావతి రాజధాని కోసం చేపట్టిన దీక్షలు ఈరోజుకి 150వరోజుకు చేరుకున్నాయి. ఈ నేపథ్యంలో అమరావతి పరిరక్షణ కోసం అమరావతి పరిరక్షణ యువజన జేఏసీ ఆధ్వర్యంలో గుంటూరులో 12 గంటల నిరాహార దీక్ష చేపట్టారు. అమరావతి రైతులు, మహిళలకు సంఘీభావం తెలిపిన అనంతరం జేఏసీ సభ్యులు దీక్షలో కూర్చున్నారు. ఒకటే రాష్ట్రం ఒకటే రాజధానిగా అమరావతినే కొనసాగించాలని డిమాండ్‌ చేశారు. విశాఖలో ప్రమాదం జరిగిన ప్రాంతంలో ప్రతి పౌరుడికి ప్రభుత్వం ప్రత్యేక ఆరోగ్య కార్డులు మంజూరు చేయాలని, మద్యపాన నిషేధం అమలు చేస్తూ, సామాజిక దూరం దెబ్బతీస్తున్న మద్యం దుకాణాలను మూసివేయాలని, లాక్‌డౌన్‌ వేళ జారీ చేస్తున్న విద్యుత్‌ బిల్లులను రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు.

ఇదీచూడండి. రైతు భరోసాతో 49 లక్షల 56 వేల మందికి లబ్ధి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.