ETV Bharat / state

మార్పుకి సంకేతం.. స్థానిక సమరంలో యువత

పంచాయతీ ఎన్నికల పోరులో పోటీకి యువత ముందుకొస్తున్నారు. ఇంజనీరింగ్ వంటి సాంకేతిక విద్యతో పాటు  వంటి వృత్తిపరమైన కోర్సులు చదువుతున్న వారు పంచాయతీ ఎన్నికల్లో పోటీకి ఆసక్తి చూపిస్తున్నారు. గుంటూరు జిల్లాలో సర్పంచ్ ఎన్నికల్లో పోటీకి దిగిన యువతరం ఆలోచనలు, ఆశయాలు, స్థానిక సమస్యలపై వాళ్లకున్న అవగాహన ఎంటో ఓసారి చూద్దాం...

youth-in-the-local-elections-at-guntur
స్థానిక సమరం పోటీలో యువత
author img

By

Published : Feb 15, 2021, 1:56 PM IST

ఏ పదవికైనా.. అనుభవంతో పాటు ఆలోచనలూ అవసరం. అందుకే సరికొత్త ఆలోచనలతో.. మంచి పరిపాలన అందించడమే లక్ష్యంగా పల్లె పోరులో యువత పోటీ పడుతున్నారు. గుంటూరు జిల్లా క్రోసూరు మండలం అందుకూరు సర్పంచిగా గిరిజ పోటీ చేస్తున్నారు. ఆమె ఇంజనీరింగ్ పూర్తి చేసి.. ఓ సాఫ్ట్ వేర్ కంపెనీలో ఉద్యోగిగా రాణిస్తున్నారు.

సర్పంచ్​ బరిలో సాఫ్ట్ వేర్ ఉద్యోగి..

గిరిజకు నెలరోజుల క్రితమే బాపట్లకు చెందిన యువకుడితో పెళ్లయింది. అయితే ఆమె స్వగ్రామం అందుకూరులో సర్పంచ్‌ స్థానానికి మహిళకు రిజర్వు కావడంతో.. గ్రామానికి సేవ చేయాలనే లక్ష్యంతో బరిలోకి దిగింది. తన భర్తతో పాటు అత్తింటివారు కూడా గిరిజను పోటీ చేయించేందుకు అంగీకరించారు. గిరిజ పోటీపై తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ ట్వీట్‌ చేశారు. ఉన్నత విద్యావంతులైన యువత రాజకీయాల్లోకి రావాలని ఆకాంక్షించారు.

వార్డు సభ్యురాలిగా సీఏ విద్యార్థిని సాజీదా...

పెదకూరపాడులో సీఏ విద్యార్థిని వార్డు సభ్యురాలిగా పోటీ చేస్తున్నారు. పంచాయతీ ఎన్నికల్లో 4వ వార్డు నుంచి సాజీదా పోటీకి దిగారు. ప్రజాజీవితంలోకి రావాలనుకునే వారికి గ్రామపంచాయతీ ఎన్నికలే తొలిమెట్టని అంటున్నారు సాజిదా. రోజూ కొంత సమయం ఆన్ లైన్ క్లాసుల ద్వారా సీఏ పాఠాలు వింటూ.. మిగతా సమయంలో ఎన్నికల్లో ప్రచారం చేస్తున్నారు. యువతరం రాజకీయాల్లోకి రావాలని.. అది ప్రజలకు తప్పకుండా మేలు చేస్తుందని సాజీదా ఆశాభావం వ్యక్తం చేశారు.

మార్పుకి సంకేతం..

సర్పంచి ఎన్నికల్లో యువత పోటీ చేయటం ఇపుడు కొత్త ఒరవడి. అది కూడా కంప్యూటర్, సీఏ వంటి వృత్తి నిపుణులు గ్రామ రాజకీయాల్లోకి రావటం మార్పుకి సంకేతంగా చెప్పుకోవాలి.

ఇవీ చూడండి...: పంచాయతీ పోరులో వినూత్న ప్రచారం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.