గుంటూరు జిల్లా చిలకలూరిపేట వద్ద ఓగేరు వాగు వంతెన సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఘటనలో ఒక యువకుడు మృతి చెందాడు. ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న యువకుడిని లారీ ఢీకొనడంతో ప్రమాదం జరిగింది.
మృతుడు ఒడిశా రాష్ట్రానికి చెందిన వలస కార్మికుడిగా పోలీసులు గుర్తించారు. చిలకలూరిపేట మండలం బొప్పూడి వద్ద ఓ వస్త్ర పరిశ్రమలో కార్మికుడిగా పనిచేస్తున్నట్లు చెప్పారు. చిలకలూరిపేట పట్టణ ఎస్ఐ రాంబాబు కేసు నమోదు చేశారు.
ఇదీ చదవండి:
ఏపీలో అదృశ్యమై మధ్యప్రదేశ్లో తేలాడు.. ఆరేళ్లకు ఇంటికి చేరాడు!