ETV Bharat / state

ప్రేమ పెళ్లికి పెద్దలు ఒప్పుకోలేదని యువతి బలవన్మరణం

ప్రేమించిన వాడితో పెళ్లి కాదేమోనన్న భయంతో యువతి ఆత్మహత్య చేసుకుంది. ప్రియురాలి మృతిని తట్టుకోలేక ప్రియుడు ఆత్మహత్యాయత్నం చేశాడు. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.

young women suicide
young women suicide
author img

By

Published : Aug 24, 2020, 9:45 PM IST

ప్రేమ వివాహానికి పెద్దలు అంగీకరించలేదని యువతి బలవన్మరణం చెందిన ఘటన గుంటూరు జిల్లాలో జరిగింది. గుంటూరు జిల్లా సత్తెనపల్లి మండలం నందిగామ గ్రామానికి చెందిన ఇస్మాయిల్ అనే యువకుడు, కొమెరపూడి గ్రామానికి చెందిన మహబూబ్ బీ అనే యువతి కొన్నాళ్లుగా ప్రేమించుకుంటున్నారు. అయితే వీరి వివాహానికి ఇస్మాయిల్ కుటుంబ సభ్యులు ఒప్పుకోలేదు. మనస్థాపం చెందిన మహబూబ్ బీ పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది.

ప్రియురాలు మృతి చెందిన విషయం తెలిసి ఇస్మాయిల్ ఆత్మహత్యాయత్నం చేశాడు. ప్రస్తుతం ఇస్మాయిల్ సత్తెనపల్లిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతని పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. అబ్బాయి ఇంట్లో పెళ్లికి నిరాకరించడం వల్లే మహబూబ్ బీ ఆత్మహత్య చేసుకుందని ఆమె బంధువులు తెలిపారు. సత్తెనపల్లి సీఐ నరసింహారావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి
వివాహేతర సంబంధానికి ఇద్దరు బలి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.