మీడియా సమావేశంలో మాట్లాడుతున్న మోదుగుల ప్రత్యేక హోదా కోసం కేంద్రంపై ఒత్తిడి తీవ్రతరం చేస్తామని... గుంటూరు వైకాపా ఎంపీ అభ్యర్ధి మోదుగుల వేణుగోపాలరెడ్డి అన్నారు. వైకాపా అధ్యక్షుడు జగన్ మొదటి నుంచి హోదా కోసం అలుపెరగని పోరాటం చేస్తున్నారని.. తాను కూడా హోదా కోసం పార్లమెంట్ లో కృషి చేశానని చెప్పారు. ఎంపీ జయదేవ్ మిస్టర్ ప్రైమ్ మినిస్టర్ అనగానే సన్మానాలు చేశారని మోదుగుల ఎద్దేవా చేశారు. మాతృభాష పలకడం, రాయడం రాని జయదేవ్ ఎంపీ పదవికి అనర్హుడని.. తాను ఎంపీగా గెలిస్తే ఇలాంటి వారిని అనర్హులుగా ప్రకటించాలని బిల్లు పెడతానని చెప్పారు. గుంటూరు ఎంపీగా ఎన్నికయ్యే అర్హత తనకే ఉందని మోదుగుల చెప్పారు.
ఇవి చూడండి...
వైకాపా స్టార్ క్యాంపెయినర్‌గా మోదీ వ్యవహరిస్తున్నారు: వైవీబీ