సీపీఐ నేతల వ్యవహరశైలి అభ్యంతరకరంగా ఉందని వైకాపా ఆరోపించింది. రాష్ట్రంలో ఉన్నది కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియానా లేక చంద్రబాబునాయుడు పార్టీ ఆఫ్ ఇండియానా అని వైకాపా ఎమ్మెల్యే టి.జె.ఆర్ సుధాకర్ బాబు సోమవారం ప్రశ్నించారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ భూస్వాములకు, పెట్టుబడిదారులకు స్నేహితుడిగా మారారని ఆరోపించారు.
చంద్రబాబు మాయలో పడి కమ్యూనిస్ట్ పార్టీల పట్ల ప్రజలకు ఉన్న గౌరవాన్ని తగ్గించుకోవద్దని వ్యాఖ్యానించారు. సీపీఐ నేత రామకృష్ణ జీవితంలో పోరాడి ఎంతమందికి ఇళ్ల స్థలాలు ఇప్పించారో చెప్పాలని డిమాండ్ చేశారు. వైకాపా ప్రభుత్వంలో ఏ పోరాటాలు చేయకుండానే 30 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇస్తుంటే అడ్డుకుంటారా అని ప్రశ్నించారు.