అసెంబ్లీతోపాటు పరిపాలన రాజధాని అమరావతిలోనే ఉంటే బాగుంటుందని వైకాపా శాసనసభ్యుడు, గుంటూరు జిల్లా నరసరావుపేట నుంచి గెలిచిన గోపిరెడ్డి శ్రీనివాస రెడ్డి అన్నారు. 2 రోజులుగా ముఖ్యమంత్రి అభిప్రాయాన్ని వైకాపా నేతలంతా సమర్థిస్తుంటే.. ఈయన మాత్రం కాస్త భిన్నమైన స్వరం వినిపించారు. సచివాలయం కూడా అమరావతి ప్రాంతంలోనే ఉండాలని శ్రీనివాసరెడ్డి అభిప్రాయపడ్డారు. పాలన అంతా ఒకే ప్రాంతం నుంచి సాగితే బాగుంటుందని అన్నారు. విశాఖను మాత్రం ఆర్థిక రాజధానిగా చేయాలని చెప్పారు. ఈ అంశాలను సీఎం దృష్టికి తీసుకెళ్తామన్నారు.
ఇదీ చదవండి: